Chiranjeevi wife Surekha Emotional: కన్నీటి పర్యంతమైన చిరంజీవి సతీమణి.. ఓదారుస్తున్న అల్లు అర్జున్,రామ్ చరణ్!

Chiranjeevi wife Surekha Emotional: మెగా ఫ్యామిలీ లో అందరూ హీరోలు కలిసి ఒకే చోట ఉంటే, చూడాలని అభిమానుల కోరిక. చాలా అరుదుగా ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. కానీ నేడు ఒక దురదృష్టకరమైన సంఘటన కారణంగా వీళ్లంతా ఒక చోట చేరారు. అందుకు సంభందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అల్లు అరవింద్ తల్లి, రామ్ చరణ్(Global Star Ram Charan) అమ్మమ్మ, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నాన్నమ్మ అయినటువంటి అల్లు వెంకటరత్నమ్మ(Allu Venkata Ratnamma) నేడు స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. వీళ్లందరినీ ఒక చోట చూసినందుకు ఆనందపడాలో, లేకపోతే వాళ్లంతా విషాదం లో ఉన్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అభిమానులకు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అనేక వీడియోలలో ఇప్పుడు ఒక వీడియో అభిమానుల గుండెల్ని హత్తుకుంది. తన తల్లి చనిపోయినందుకు చిరంజీవి సతీమణి సురేఖ కన్నీటి పర్యంతమైన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఒక వీడియో లో సురేఖ ఏడుస్తుంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ఆమెని ఓదార్చడాన్ని చూసి అభిమానులు బాగా ఎమోషనల్ అయిపోయారు. సోషల్ మీడియా లో అభిమానుల మధ్య ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ, వాళ్ళు ఎప్పటికీ ఒక కుటుంబమే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏ చిన్న కష్టమొచ్చినా అందరూ ఏకం అయిపోతారు. గతం లో కూడా అలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలబడింది. రెండేళ్ల క్రితం వీళ్లంతా కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్న సందర్భం కూడా ఉంది. అంతా బాగానే ఉంది కానీ, ఇలాంటి సమయాల్లో పవన్ కళ్యాణ్ లేని వెలతి స్పష్టంగా కనిపిస్తుంది. నేడు ఆయన వైజాగ్ లో ‘సేనాని తో సేన’ అనే భారీ బహిరంగ సభ ని నిర్వహించబోతున్నాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న సభ కాబట్టి, రద్దు చేసి వచ్చే పరిస్థితులు లేవు, అందుకే ఆయన రాలేకపోయాడు.

కానీ ట్విట్టర్ ద్వారా తన సంతాపం ని వ్యక్తం చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని విషయం తెలిసి చింతిస్తున్నాను. చెన్నై లో మేమంతా కలిసి ఉన్నప్పటి నుండి ఆమె పై చూపించిన ఆప్యాయత ని ఎప్పటికి మర్చిపోలేను. తన చుట్టూ ఉన్నవారిపై అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ ని తీర్చిద్దరు. కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భావంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. రేపు ఆయన తన సోదరుడు నాగబాబు తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చేరి అల్లు కుటుంబాన్ని పరామర్శించనున్నాడు.

Leave a Comment