Asia Cup Record : 13 ఏళ్లుగా చెక్కు చెదరని విరాట్ కోహ్లీ రికార్డు.. దానిని బద్దలు కొట్టడం కష్టమే – Telugu News | Virat Kohli Holds Record for Highest Individual Score in Asia Cup

Asia Cup Record : ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. కోహ్లీ ఈ రికార్డును 2012లో పాకిస్తాన్‌పై సాధించాడు. గత 13 ఏళ్లుగా కోహ్లీ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఈ జాబితాలో కోహ్లీ ఒక్కడే భారత ఆటగాడు కాగా, పాకిస్తాన్ నుంచి ముగ్గురు, బంగ్లాదేశ్ నుంచి ఒక ఆటగాడు ఉన్నారు.

ఆసియా కప్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ

భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. 2012లో పాకిస్తాన్‌పై 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ అద్భుతమైన 183 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా భారత్ 13 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.

బాబర్ ఆజమ్

పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. బాబర్ 2023లో నేపాల్‌పై 131 బంతుల్లో 151 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 115.26.

యూనిస్ ఖాన్

పాకిస్తాన్ మాజీ దిగ్గజం యూనిస్ ఖాన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2004లో హాంకాంగ్‌పై 122 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 118.03.

ముష్ఫికర్ రహీమ్

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 2018లో శ్రీలంకపై 150 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 96.

షోయబ్ మాలిక్

పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 2004లో భారత్‌పై 127 బంతుల్లో 143 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 112.59.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Comment