Asia Cup 2025: ఆసియా కప్ కోసం భారత జట్టులో పెద్ద పెద్ద దిగ్గజాలను చేర్చారు. ఈ జట్టులో సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్‌ను కూడా ఓడిపోలేదు. శుభమన్ గిల్, తిలక్ వర్మ వంటి ఫామ్ ఉన్న బ్యాట్స్‌మెన్‌లు, అలాగే ఆల్‌రౌండ్ విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉండడం వల్ల భారత్ టైటిల్ గెలవడానికి బలమైన పోటీదారుగా నిలుస్తుంది. అయితే, ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ ఆడే ముందు, ఈ జట్టులో ఎంత మంది ఆటగాళ్లు పెళ్లయినవారు, ఎంత మంది సింగిల్స్ ఉన్నారో ఇక్కడ తెలుసుకోండి.
పెళ్లైన ఆటగాళ్ళు లేదా పెళ్లి కాబోతున్నవారు
ఆసియా కప్ భారత జట్టులో మొత్తం 10 మంది ఆటగాళ్లు పెళ్లైనవారు లేదా నిశ్చితార్థం చేసుకున్నవారు ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2016లో దేవిషా శెట్టిని వివాహం చేసుకున్నాడు. అలాగే శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్‌కు కూడా పెళ్లైంది. జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు నిశ్చితార్థం అయింది.. కానీ ఇంకా పెళ్లి కాలేదు. కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్ ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విడాకులయ్యాయి. అతను సెర్బియన్ మోడల్ నతాషా స్టాంకోవిక్‌ను వివాహం చేసుకున్నప్పటికీ 2024లో విడాకులు తీసుకున్నారు.
బ్యాచిలర్స్
భారత జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు. ఈ జాబితాలో మొదటి పేరు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్. అతనితో పాటు, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఫాస్ట్ బౌలర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా బ్యాచిలర్లే.
ఆసియా కప్ కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి