Highest Partnership in the Asia Cup History: క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. భాగస్వామ్యం స్కోరును వేగంగా పెంచడమే కాకుండా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా పనిచేస్తుంది. భారీ భాగస్వామ్యం క్లిష్ట పరిస్థితిలో జట్టును కాపాడగలదు. మ్యాచ్‌ను ఓటమి నుంచి కాపాడుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఇద్దరు బ్యాటర్ల మధ్య భాగస్వామ్యం తరచుగా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆసియా కప్‌లో కూడా, మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చిన కొన్ని భాగస్వామ్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్‌లో 5 అతిపెద్ద భాగస్వామ్యాల గురించి తెలుసుకుందాం.
1. విరాట్ కోహ్లీ – కేఎల్ రాహుల్: ఆసియా కప్ చరిత్రలో అతిపెద్ద భాగస్వామ్యం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య జరిగింది. 2023 సెప్టెంబర్ 10న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 233 పరుగుల రికార్డు భాగస్వామ్యం కనిపించింది.
2. నాసిర్ జంషెడ్ – మహ్మద్ హఫ్: ఈ జాబితాలో పాకిస్తాన్ ఆటగాళ్ల పేర్లు రెండవ స్థానంలో ఉన్నాయి. 2012లో మీర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో, నాసిర్ జంషెడ్, మహ్మద్ హఫీజ్ మధ్య మొదటి వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం ఉంది.
ఇవి కూడా చదవండి
3. యూనిస్ ఖాన్ – షోయబ్ మాలిక్: మూడవ స్థానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల పేర్లు వచ్చాయి. కొలంబోలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్ మూడో వికెట్‌కు 223 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
4. ఇఫ్తికార్ అహ్మద్ – బాబర్ అజామ్: 2023 ఆగస్టు 30న నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇఫ్తికార్ అహ్మద్, బాబర్ ఆజం మధ్య ఐదవ వికెట్‌కు 214 పరుగుల భాగస్వామ్యం ఉంది.
5. విరాట్ కోహ్లీ – అజింక్య రహానే: ఈ జాబితాలో భారత ఆటగాళ్ల పేర్లు ఐదవ స్థానంలో నిలిచాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, అజింక్యా మూడో వికెట్‌కు 213 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
6. రోహిత్ శర్మ – శిఖర్ ధావన్: 2018లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 210 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం 6వ స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..