AP Rain Alert: ఏపీకి ముప్పు.. దూసుకొస్తున్న రెండు అల్పపీడనాలు!

AP Rain Alert: ఏపీకి ముప్పు.. దూసుకొస్తున్న రెండు అల్పపీడనాలు!

AP Rain Alert: ఏపీలో( Andhra Pradesh) వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో తేలికపాటి జల్లులు పడుతూనే ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతంగా ఉంది. చిన్నపాటి జల్లులు కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిస్సా తీరప్రాంతాల మీదుగా సెప్టెంబర్ ఐదు నాటికి వాయుగుండం గా బలపడే అవకాశం ఉంది.

Also Read: ట్రంప్ ఇండియాతో పెట్టుకుంటున్నావ్?

* ఇప్పటికే వర్షాలు
ఇటీవల బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తాయి. కోస్తాంధ్రలో సైతం ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. మళ్లీ తుఫాన్ హెచ్చరికలు రావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సెప్టెంబర్ రెండోవారంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదుల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది.
* శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు ఉంది. ధవలేశ్వరం దగ్గర ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 7.58 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపటి వరకు ఇదే తీవ్రత కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
* ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,08,838 క్యూసెక్కులుగా ఉంది.
* కృష్ణా, గోదావరి తుంగభద్ర నది పరివాహక లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలు ఆందోళనతో ఉన్నారు. వారికి ప్రత్యేక అప్రమత్త చర్యలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. అదే సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైతం సూచనలు చేస్తోంది. వినాయక నిమజ్జనాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.

Leave a Comment