Allu Kanakaratnam-Chiranjeevi: వయోభారం వల్ల ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు కనకరత్నం కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు.. అల్లు రామలింగయ్యను వివాహం చేసుకున్న తర్వాత.. ఆమె ఆయన ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయన సినిమాల వెంట పరుగులు పెడుతున్న క్రమంలో.. పిల్లల బాగోగులు ఆమె కనిపెట్టుకున్నారు. అంతేకాదు పాలకొల్లులో నివాసం ఉన్నా.. చెన్నైలో కొంతకాలం ఉన్నా.. హైదరాబాద్ నగరానికి షిఫ్ట్ అయినా.. ఆమె సంసారాన్ని సజావుగా సాగించారు. పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు.
అల్లు కనక రత్నం చనిపోయిన తర్వాత మీడియా తెగ హడావిడి చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నానమ్మ చనిపోయారు.. అంటూ హెడ్లైన్లు వేస్తోంది. అల్లు కనుక రత్నానికి పేరు లేనట్టు.. ఆమెకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేనట్టు వక్ర భాష్యం చెబుతోంది. వాస్తవానికి అల్లు రామలింగయ్య సినిమాలలో స్థిరపడడానికి ప్రధాన కారణం కనక రత్నం. ఆయన ఉన్న ఊరిని వదిలేసి సినిమాల వెంట పరుగులు తీస్తున్న క్రమంలో సంసారం అనే నావను ఆమె ఒంటి చేత్తో నడిపించారు. ప్రాంతాలు మారినప్పటికీ.. పిల్లలను కనిపెట్టుకొని ఉన్నారు. అరుదైన సందర్భంగా తప్ప ఎప్పుడూ ఆమె బయటికి రాలేదు. వాస్తవానికి కనకరత్నం అల్లు కుటుంబానికే కాదు.. కొణిదెల కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితురాలు. ఈ రెండు కుటుంబాలు ఈ స్థాయిలో ఎదగడానికి ఆమె కూడా ఓ ప్రధాన కారణం. అన్నిటికంటే ముఖ్యంగా కొణి దెల చిరంజీవి అల్లు వారింట అల్లుడుగా అడుగుపెట్టడానికి ప్రధాన కారణం కనక రత్నమే.
అల్లు అరవింద్ తర్వాత అల్లు రామలింగయ్య దంపతులకు ఓ కుమారుడు కలిగాడు. అతడికి యుక్త వయసు వచ్చిన తర్వాత అనారోగ్యం వల్ల కన్నుమూశాడు. అప్పటికి సురేఖకు ఇంకా వివాహం కాలేదు. ఆ సమయంలో కనుక రత్నం చనిపోయిన కుమారుడి గురించి తలచుకొని తలుచుకొని తీవ్రంగా దుఃఖించేది. అతని జ్ఞాపకాల నుంచి బయటపడలేక పోయింది. ఈ దశలో సురేఖకు వివాహం చేయాలని రామలింగయ్య భావిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి సురేఖను ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతిపాదనలు జరుగుతున్న సమయంలో.. ఆ విషయం కనకరత్నం చెవిలో పడింది. చిరంజీవి చూసేందుకు తన చనిపోయిన కుమారుడి మాదిరిగా ఉండడంతో కనకరత్నం గట్టిగా నిర్ణయించుకున్నారు.. అతడినే తన అల్లుడిగా చేసుకోవాలని భావించారు. అల్లు రామలింగయ్య పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి చిరంజీవిని తన ఇంటి అల్లుడిగా చేసుకున్నారు. ఒకరకంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు వారింటికి అల్లుడుగా మారిపోయారు అంటే దానికి ప్రధాన కారణం అల్లు కనక రత్నం.. చిరంజీవి సురేఖ వివాహం చేసుకున్న తర్వాత.. అల్లు వారి ఇంట్లో అల్లుడుగా అడుగుపెట్టిన తర్వాత.. కనకరత్నం ఆయనను అత్యంత ప్రేమగా చూసుకునేవారు. ఇదే విషయాన్ని చిరంజీవి అనేక సందర్భాల్లో చెప్పారు. అల్లు అరవింద్ కూడా ఇటీవల ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.. కనకరత్నం కన్నుమూసిన నేపథ్యంలో ఆమెతో తనకు ఉన్న జ్ఞాపకాలను చిరంజీవి నెమరు వేసుకుంటున్నారు. ఆమె భౌతిక కాయాన్ని చూసి తల్లడిల్లిపోయారు.