Allu Arjun Emotional Video: రామ్ చరణ్ ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్, అల్లు అరవింద్.. ఎమోషనల్ వీడియో!

Allu Arjun Emotional Video: నేడు ఉదయం మెగా అభిమానులు అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ(Allu Kanaka Ratnamma) మరణ వార్త తో నిద్ర లేచి తీవ్రమైన దిగ్బ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సంఘటనకు సంభందించిన వీడియోలే కనిపిస్తున్నాయి. మెగా హీరోలంతా ఒక్క చోట చేరడం తో అభిమానులు ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ,రామ్ చరణ్(Global Star Ram Charan) కలిసి ఒకే చోట ఉండడం తో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమధ్య కాలం లో వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఏర్పడ్డాయని, ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంత గ్యాప్ ఏర్పడిందని, ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. వీళ్లిద్దరు కూడా ఈమధ్య కలిసి చాలా కాలం అవ్వడంతో ఇదంతా నిజమేనేమో అని మెగా అభిమానులు కూడా నమ్మారు.

అయితే ఇలాంటి రూమర్స్ ఎన్ని వినిపించినా కష్టమొస్తే వీళ్లంతా ఒక్కటి అవుతారు అనేది అనేక సందర్భాల్లో మనకి కనిపిస్తూనే ఉంది. ఒకవేళ వాళ్ళ మధ్య గొడవలు ఉన్నప్పటికీ , అవి తాత్కాలికమే అనే వాస్తవం అభిమానులు కూడా గుర్తించాలి. నేడు అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని చూస్తే వీళ్ళ మధ్య గొడవలు ఏర్పడ్డాయి అంటూ ఇన్ని రోజులు సోషల్ మీడియా లో వినిపించిన వార్తలు నిజమని అనిపిస్తుందా?, అల్లు అర్జున్ కనపడగానే రామ్ చరణ్ హత్తుకోవడం, అల్లు అర్జున్ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకోవడం, ఆ తర్వాత ఇద్దరు కలిసి అంత్యక్రియలకు కావాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవడం వంటివి అభిమానుల హృదయాలను కట్టిపారేశాయి. కాబట్టి ఇకనైనా అభిమానులు గొడవలు పడకుండా సోషల్ మీడియా లో సఖ్యతతో ఉంటారో లేదో చూద్దాం. సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ కొట్లాడుకునే రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు ఒక్కటి అయిపోయారు. ఇది చూసేందుకు మెగా అభిమానులకు కూడా చాలా బాగా అనిపించింది.

Leave a Comment