6.08 రేటింగ్సే హైయెస్ట్.. ఇదీ జెమినీ టీవీ దుర్బలత్వం!

Gemini TV TRP Ratings: బలమైన నెట్వర్క్ ఉంది. విస్తృతమైన మ్యాన్ పవర్ ఉంది. అన్నిటికంటే ఆర్థికంగా సంపత్తి కలిగిన యాజమాన్యం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ జెమినీ రాత మారడం లేదు. పైగా ఎప్పుడో తాతల కాలం నాడు కొనుగోలు చేసిన సినిమాలే ఆ ఛానల్ ను బతికిస్తున్నాయి. మొన్ననే చెప్పుకున్నాం కదా జెమినీ టీవీ టాప్ 5 లో కూడా లేదని.. అంతేకాదు ఆ ఛానల్ ప్రసారం చేస్తున్న సినిమాల రేటింగ్స్ కూడా ఐదు దాటడం లేదు. నిష్టూరంగా ఉన్నప్పటికీ ఇదే నిజం.

Also Read: రాజస్థాన్ రాయల్స్ నుంచి ద్రావిడ్ ఎందుకు తప్పుకున్నారు? కారణం అదేనా?

ఆ సినిమాదే హైయెస్ట్ రికార్డ్

ఈ ఏడాది హైయెస్ట్ టిఆర్పి రేటింగ్స్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డు సృష్టించింది. జీ తెలుగులో ఈ సినిమాను ముందుగానే టెలికాస్ట్ చేశారు. ఓటిటి కంటే ముందుగానే ప్రసారం చేయడంతో ఏకంగా 18.22 టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానం పుష్ప ది రూల్ సొంతం చేసుకుంది. స్టార్ మా లో టెలికాస్ట్ అయినా ఈ సినిమా 12.61 టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా జీ తెలుగులో టెలికాస్ట్ అయింది. ఈ సినిమా 10.32 టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవ్వగా.. పుష్ప ది రూల్ మాటీవీలో టెలికాస్ట్ అయింది. ఒకరకంగా హైయెస్ట్ రేటింగ్స్ సినిమాలను టెలికాస్ట్ చేసిన రికార్డును జీ తెలుగు దక్కించుకుంది. అంతేకాదు ఈ సంవత్సరంలో భారీ చిత్రాల రైట్స్ కొనుగోలు చేసి మొదటి స్థానంలో ఉన్న ఛానల్ కంటే అందనంత ఎత్తులో ఉంది జీ తెలుగు.

స్టార్ మా మొదటి స్థానం..

ఎంటర్టైన్మెంట్ చానల్స్ విభాగంలో స్టార్ మా మొదటి స్థానంలో ఉంటుండగా.. జీ తెలుగు రెండో స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి స్టార్ మా అనుభవిస్తున్న స్థానం ఒకప్పుడు జెమినీ టీవీ ది. కాలంతో పాటు మార్పులను ఆహ్వానించక.. అదే రొటీన్ స్ట్రాటజీని కొనసాగిస్తుండడంతో జెమిని వెనుకబడిపోయింది. మొదటి స్థానాన్ని కోల్పోయింది. రెండో స్థానాన్ని జీ తెలుగుకు అప్పగించింది. మూడో స్థానాన్ని ఈటీవీకి అప్పగించింది. నాలుగో స్థానాన్ని మా మూవీస్ దక్కించుకుంది. మొన్నటిదాకా 5వ స్థానం కూడా దిక్కులేదు. తన విభాగం నుంచి ప్రసారాలు చేస్తున్న జెమినీ మూవీస్ ను అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది జెమిని టీవీ. అయితే ఈ స్థానం స్థిరంగా ఉంటుందని చెప్పలేం.

ఈ ఏడాది ఇప్పటివరకు

ఈ ఏడాది ఇప్పటివరకు జెమినీలో హైయెస్ట్ టీఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. అప్పుడప్పుడో 2005లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ జెమిని టివి ని బతికిస్తోంది. ఆగస్టు 17న ఈ సినిమా టెలికాస్ట్ అవ్వగా అర్బన్ రూరల్ ఏరియాస్ కలిపి 6.8 రేటింగ్ సొంతం చేసుకుంది. అర్బన్ ఏరియాలో 5.23 రేటింగ్స్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత స్థానం రాజా సినిమా సొంతం చేసుకుంది. జూలై 6న ప్రసారమైన ఈ సినిమా అర్బన్ ఏరియాలో 4.88, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 5.50 రేటింగ్స్ సొంతం చేసుకుంది. జూలై 22 ఆదివారం నాడు టెలికాస్ట్ అయిన గుంటూరు కారం అర్బన్ ఏరియాలో 3.39, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 3.32 రేటింగ్స్ దక్కించుకుంది. మే 11న సర్వేరు నీకెవరు సినిమా టెలికాస్ట్ అయితే అర్బన్ ఏరియాలో 4.78, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 4.11 రేటింగ్ దక్కించుకుంది. మే 4న అల వైకుంఠపురం లో టెలికాస్ట్ అయితే.. అర్బన్ ఏరియాలో 4.6.. అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 3.51 రేటింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం. పోటీ చానల్స్ రేటింగ్స్ విషయంలో దూసుకుపోతుంటే.. జెమిని మాత్రం ముక్కీ మూలిగి 10లోపు రేటింగ్స్ మాత్రమే సొంతం చేసుకోవడం ఆ ఛానల్ దుర్బలత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Leave a Comment