‘సింగర్ ఆఫ్ ది ప్యారడైజ్’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

Songs Of Paradise Review: సినిమా ఇండస్ట్రీ పెను మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బయోపిక్ సినిమాలకి చాలా మంచి ఆదరణ అయితే లభిస్తోంది. ఇక వాళ్ళ కెరియర్ లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాళ్లు అనుకున్న గోల్ ను ఎలా అచ్చివ్ అయ్యారు అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పటికే ఇండియాలో చాలా మంది లెజెండ్స్ యొక్క బయోపిక్ లను తెరకెక్కించడం చూశాం…ఇక మొట్టమొదటి రేడియో ఫిమేల్ సింగర్ అయిన నూర్ బేగం యొక్క కథతో ‘ సింగర్ ఆఫ్ ద పారడైజ్’ అనే సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Also Read: ట్రంప్ ఇండియాతో పెట్టుకుంటున్నావ్?

కథ

నూర్ బేగంకి స్వతహాగా పాటలు పాడే టాలెంట్ రావడంతో ఆమె తరచుగా పాటలను పాడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో ఆమె రేడియో సింగర్ అవ్వాలని అనుకుంటుంది. కానీ ఆమెకు చాలా కాంప్లికేషన్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె ఎలా రేడియో సింగర్ గా మారింది. ఆ తర్వాత ఆమె కెరియర్ ఎలా టర్న్ అయింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అయిన ధనుష్ రెంజు అద్భుతంగా ఈ సినిమాను తెరకేక్కించే ప్రయత్నం అయితే చేశాడు… ముఖ్యంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. వాటిని తను స్పష్టంగా తెలియజేస్తూ ఒక అమ్మాయి లేడీస్ సింగర్ అవ్వాలనుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇక ఆ రోజుల్లో ఒక అమ్మాయి బయటకు వచ్చి చదువుకోడానికే చాలా కండిషన్స్ ఉండేవి. మరి అలాంటి ఆవిడ ఒక రేడియోలో ఫిమేల్ సింగర్ గా మారాలి అంటే ఆమె ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొందో ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక దానికి తగ్గట్టుగానే రేడియో సింగర్ గా, రంగస్థల నటిగా, ప్రముఖ సింగర్ గా ఎలా మారింది అనే విషయాలను కూడా ఇందులో చాలా పెయిన్ ఫుల్ గా తెరకెక్కించి చూపించారు. మరి మొత్తానికైతే ఒక బయోపిక్ అంటే ఏ రేంజ్ లో ఉండాలో ఈ సినిమాలో అవన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక అప్స్ అండ్ డౌన్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. వాటిని ప్రేక్షకుడికి నచ్చే కోణంలో కొంచెం మెటీరిలైజ్ చేసి చూపించిన వైనం అయితే అద్భుతంగా ఉంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టులు పెర్ఫామెన్స్ విషయానికి వస్తే సభా ఆజాద్, సోనీ రాజధన్ మెయిన్ లీడ్ లో చేసి నూర్ బేగం క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించి మెప్పించారు. అలాగే ప్రతి సన్నివేశంలో కూడా డీసెంట్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ నిజంగా ఓల్డ్ ఏజ్ లో నూర్ బేగం లాగా చాలా అద్భుతంగా నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఈ సినిమాకి ప్రాణం పోశారు. ఇక మిగిలిన వాళ్లందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఒదిగిపోయి నటించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించింది. ఇక విజువల్స్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అనిపించింది. మొత్తానికైతే సినిమా ఒక బయోపిక్ ను తెర మీద ఆవిష్కరించిన విధానమైతే బాగుంది. ప్రేక్షకుడికి ఈ సినిమా చూశాక ఒక ఎమోషనల్ ఫీల్ అయితే కలుగుతోంది… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

కథ
ఎమోషనల్ సీన్స్
ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ లో కొన్ని సీన్స్…
మ్యూజిక్

రేటింగ్

ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

 

Leave a Comment