సరదాగా సాగే ‘బూమ్ బూమ్..’

సరదాగా సాగే ‘బూమ్ బూమ్..’

యంగ్ హీరో ప్రదీప్ రంగ నాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ’ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ – బూమ్ బూమ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటని సాయి అభ్యాంకర్ స్వరపరిచి పాడారు. విజువల్స్, సరదాగా గడిపే ఫ్రెండ్స్ గ్యాంగ్, ప్రదీప్ , మమిత కెమిస్ట్రీ, స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌లతో సాంగ్ చాలా ట్రెండీగా వుంది. ఈ దీపావళికి ఈ చిత్రం అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం , కన్నడ భాషలలో విడుదల కానుంది.

Also Read : ఐదేళ్లపాటు పరిహారం

Leave a Comment