సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌.. సెప్టెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు – Telugu News | Revanth Reddy Govt Announces September Local Body Elections in Telangana, Lifts Reservation Cap

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

అంతేకాకుండా.. రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్‌ ఎత్తివేతకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌ పేర్లను తెలంగాణ కేబినెట్ ఎంపిక చేసింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌ ఎంపికపై కేబినెట్‌లో చర్చ జరగగా.. వీరి పేర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కాగా.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ఎన్నికను రద్దు చేసింది సుప్రీంకోర్టు.. అయితే.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీగా అజహరుద్దీన్‌ ఎంపిక ఆసక్తికరరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment