Data Privacy: మనం వంటింట్లో లేదా ఇంటికి సంబంధించిన నిత్యవసరాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా సూపర్ మార్కెట్ లేదా స్టోర్స్ కు వెళుతూ ఉంటాం. వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత బిల్లింగ్ సెక్షన్ వద్దకు వచ్చేసరికి క్యాష్ లేదా కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తాం. ఇప్పటివరకు బాగానే ఉంటుంది. కానీ చివరిలో కొనుగోలుదారుడి మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటారు. అసలు బిల్లు చెల్లించడానికి మొబైల్ నెంబర్ అవసరం ఏంటి? అని కొంతమందికి సందేహాలు వచ్చాయి. అంతేకాకుండా నేటి కాలంలో మొబైల్ నెంబర్ ఎక్కడపడితే అక్కడ ఇవ్వడం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి షాపింగ్ మాల్స్ వారు ఈ నెంబర్ ను ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం గా ప్రభుత్వం త్వరలో ఒక కొత్త చట్టం తీసుకురాబోతుంది.. అదేంటంటే?
Also Read: అసెంబ్లీలో ‘రుషికొండ’.. కూటమి ప్లాన్ అదే!
నేటి కాలంలో వినియోగదారుల భద్రత చాలా అవసరం. వినియోగదారుడి మొబైల్ ద్వారా పర్సనల్ డేటా చోరీ చేసేందుకు చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్నిచోట్ల అవసరం లేకున్నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లో మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చివరకు వారి నెంబర్ తీసుకుంటూ ఉన్నారు. ఈ మొబైల్ నెంబర్ తో కొందరు వినియోగదారుల పర్సనల్ డేటా చోరీ చేసే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతుంది.. The Digital Personal Data Protection Act 2023 ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే DP DP rules, 2025 కి సంబంధించిన డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం వినియోగదారుడు మొబైల్ నెంబర్ షాపింగ్ మాల్స్కు ఇవ్వాల్సిన అవసరం లేదు.
వినియోగదారుడి మొబైల్ నెంబర్ తీసుకొని స్టోర్ చేసుకుంటే Data Fiduciary అని అంటారు. ఒకవేళ ఈ నెంబర్ కనుక ఇతరులకు షేర్ చేస్తే Data Principal అని అంటారు. వినియోగదారుడి అనుమతి లేకుండా స్టోర్స్ వారు తమ డాటాను ఇతరులకు షేర్ చేసే అవకాశం లేదు. ఒకవేళ వినియోగదారుడికి తెలియకుండా తమ డాటా ఇతరులకి వెళితే వారిపై Data Protection of Board of India చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వినియోగదారుడి మొబైల్ తీసుకొని కనీసం మూడు సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వ్యవధిలో వినియోగదారుడు తనకు ఇష్టం లేకుండా మొబైల్ స్టోర్ చేసుకునే అవకాశం లేదని స్టోర్స్ వారికి తెలియజేయవచ్చు.
అంతేకాకుండా షాపింగ్ మాల్స్ లో సరుకులు లేదా వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో మొబైల్ నెంబర్ ఇవ్వకుండా బిల్ ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది. తాజాగా ప్రవేశపెట్టే ఈ చట్టం అమలులోకి వస్తే వినియోగదారుడు తమ మొబైల్ నుంచి ఎలాంటి డాటా లీక్ కాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్ నెంబర్ ఇతరులకు షేర్ చేసినట్లు గుర్తిస్తే వారిపై ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉంటుంది.
[