‘లిటిల్ హార్ట్స్’ మూవీ ట్రైలర్ లో కుర్రాళ్లే నే ఫోకస్ చేశారా..?

Little Hearts Trailer Review: ‘ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కొత్త కథలతో సినిమాలను చేస్తూ దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో వాళ్లు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం 90స్ బయోపిక్ తో మంచి విజయాన్ని అందుకున్న ‘ఆదిత్య హసన్’ ప్రొడ్యూసర్ గా మారి లిటిల్ హార్ట్స్ అనే సినిమాను నిర్మించారు… ఇక సాయి మార్తాండ్ అనే కుర్రాడు ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం… మిడిల్ క్లాస్ పిల్లలు ఎలా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల మెంటాలిటి ఎలా ఉంటుంది. వాళ్ళను కాలేజ్ కి పంపిస్తే వాళ్లు స్కూల్లో చేసే పనులేంటి? అనే వాటిని ఈ సినిమాలో తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలు లవ్ చేసుకోవడం…

Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!

అది ప్రేమ కాదు ఆకర్షణ అంటూ ఇద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా ఇద్దరి పేరెంట్స్ వీళ్ళ ప్రేమ మీద ఎలా స్పందించారు. మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఒకటయ్యారా? లేదా అనే క్యూరియాసిటిని పెంచే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.

ఇక మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తో సాగబోతోంది అనే విషయాన్ని ట్రైలర్ లో తెలియజేశారు. ఇక ఈ ట్రైలర్ ను బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనం ఒక అంచనా వేయొచ్చు. ఆదిత్య హాసన్ అనే దర్శకుడికి చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. ఆయన ఇలాంటి ఒక సినిమాని నిర్మించాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక 90స్ బయోపిక్ లో నటించిన మౌళి తంజె ప్రశాంత్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

ఇక శివాని నగరం ఇందులో హీరోయిన్గా నటిస్తుండడం విశేషం. మౌళి ఫాదర్ గా రాజీవ్ కనకాల చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే హీరోయిన్ ఫాదర్ గా కీరవాణి తమ్ముడు అయిన కాంచి నవ్వులు పూయిస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 5వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…

 

Leave a Comment