నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్ కు చెందిన నిఘా నౌకను డ్రోన్ దాడితో రష్యా పేల్చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీచర్యగా ఇవాళ ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసింది. ఖార్కివ్ సరిహద్దు సమీపంలో రెండు ముఖ్యమైన వంతెనలను పేల్చేసినట్లుగా సమాచారం. ఈ రెండు రష్యన్ దళాల పునరావాసం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాచి ఉంచిన మందుగుండు సామగ్రిని లక్ష్యంగా చేసుకుని తక్కువ ధర డ్రోన్ల సాయంతో వంతెనలను ధ్వంసం చేసినట్ల సమాచారం అందుతోంది. ఈ ఆపరేషన్‌ను ఉక్రెయిన్‌లోని 58వ ప్రత్యేక మోటరైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ నిర్వహించింది.
డ్రోన్ ఎగురవేసినప్పుడు వంతెన కింద మందుగుండుతో ఉన్న భారీ ట్యాంకర్ కనిపించింది. అందులో సామంగ్రి, మందుగుండు సామగ్రి ఉన్నట్లు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లుగా బ్రిగేడ్ ప్రతినిధి తెలిపారు. డ్రోన్ నేరుగా మందుగుండు సామగ్రి దగ్గర వెళ్లి పేలిందని పేర్కొన్నారు.
The post రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు appeared first on Navatelangana.