బిగ్ బాస్ షో కాస్త కామెడీ షో అయ్యింది..!

బిగ్ బాస్ షో కాస్త కామెడీ షో అయ్యింది..!

Bigg Boss 19 Latest Episode: మనకు తెలిసిన బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షో అంటే ఏంటి?, 24 గంటలు కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఉండాలి, ఆసక్తికరమైన టాస్కులు ఉండాలి, హోస్ట్ నాగార్జున చేత వీకెండ్ వస్తే తిట్లు ఉండాలి, ఇలా నాన్ స్టాప్ గా ఎదో ఒక ఫైర్ కంటెంట్ ఉండాలి. అప్పుడే మనం ఈ షో ని చూసేందుకు ఆసక్తి చూపిస్తాము. మన తెలుగు బిగ్ బాస్ సీజన్లు అత్యధికంగా హిట్ అయినవి గొడవలు ఉన్నవే. రెండవ సీజన్, 7 వ సీజన్ అందుకు ఒక ఉదాహరణ. అయితే పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో కూడా బిగ్ బాస్ షో ని హిట్ చేయొచ్చు అని నిరూపించింది రీసెంట్ గా హిందీ లో మొదలైన బిగ్ బాస్ 19. హిందీ లో గత బిగ్ బాస్ సీజన్స్ ని చూస్తే మన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ కంటే గొడవలు తారాస్థాయిలో ఉండేవి.

అంతే కాదు చాలా బోల్డ్ కంటెంట్ కూడా గత సీజన్స్ నుండి వచ్చేవి. లవ్ ట్రాక్స్ హద్దులు దాటేవి, రొమాన్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. కుటుంబ సమేతంగా బిగ్ బాస్ షో చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి పరిస్థితులు గత సీజన్ లో ఏర్పడడం తో తీవ్రమైన విమర్శలను బిగ్ బాస్ యాజమాన్యం ఎదురుకోవాల్సి వచ్చింది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదు. దీంతో బిగ్ బాస్ టీం ఈసారి టెలికాస్ట్ అవ్వబోయే సీజన్ ఎంటర్టైన్మెంట్ తో ఉండాలని సరికొత్తగా ప్లాన్ చేశారు. రీసెంట్ గానే మొదలైన ‘బిగ్ బాస్ 19′(Bigg Boss 19) కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ లో ఎలాంటి గొడవలు కంటెస్టెంట్స్ మధ్య జరగలేదు. చాలా నేచురల్ కామెడీ తో స్నేహితులు సరదాగా ఒక చోట కూర్చుంటే ఎలా ఉంటుందో, అలా ఉంది లేటెస్ట్ సీజన్ ఎపిసోడ్స్ మొత్తం.

కుళ్ళు జోకులు కాకుండా చాలా ఆర్గానిక్ కామెడీ ఉండడం తో ఆడియన్స్ ఈ సీజన్ ని అమితాసక్తి తో చూస్తున్నారు. అంతే కాకుండా టాస్కులు కూడా చాలా ఆసక్తికరమైనవి పెడుతున్నారు. టాస్కుల వల్ల గొడవలు అయితే ఇప్పటి వరకు జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందో లేదో చూడాలి. ఇలా ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీఠ వేస్తూ మన తెలుగు లో కూడా బిగ్ బాస్ ని ప్లాన్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. గత సీజన్ అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వంటి కంటెస్టెంట్స్ కారణంగా చాలా ఫన్ యాంగిల్ లో అనేక ఎపిసోడ్స్ నడిచాయి. మధ్యలో చాలా ఫైర్ మూమెంట్స్ కూడా జరిగాయి. అంతా పర్ఫెక్ట్ గానే గత సీజన్ సాగింది కానీ, నాగార్జున సరిగా హోస్టింగ్ చేయలేదు. అందుకే ఓవరాల్ గా గత సీజన్ యావరేజ్ గా నిల్చింది. ఈ సీజన్(Bigg Boss 9 Telugu) ఎలా ఉండబోతుందో తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే.

Leave a Comment