పోర్న్ సైట్‌లో ప్రధాని మెలోనీ ఫొటోలు.. ఇటలీలో పెను దుమారం!

ఇటలీలో ఒక పోర్న్ వెబ్‌సైట్ సృష్టించిన దుమారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని సహా పలువురు ప్రముఖ మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఆ సైట్‌లో ప్రచారం చేయడమే ఇందుకు కారణం. ఈ వికృత చర్యపై ప్రధాని మెలోని తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో 7 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న ఫికా అనే ఈ వెబ్‌సైట్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ దారుణ ఘటనపై మెలోని తీవ్రంగా స్పందించారు. జరిగిన ఘటన పట్ల నాకు తీవ్ర అసహ్యం వేస్తోంది. ఈ చర్య ద్వారా అవమానానికి, వేధింపులకు గురైన మహిళలందరికీ నా పూర్తి సంఘీభావం, మద్దతు ఉంటాయిఁ అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఁసాధారణంగా కనిపించే కంటెంట్ కూడా తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే భయంకరమైన ఆయుధంగా మారగలదు. బాధితులు వెంటనే ఫిర్యాదు చేయడమే ఉత్తమమైన రక్షణ అని ఆమె సూచించారు. ఈ వెబ్‌సైట్‌లో ప్రతిపక్ష నేత ఎల్లీ ష్లీన్ ఫొటోలను కూడా మార్ఫింగ్ చేశారు. ఆమె ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇది సమాజంలో వేళ్లూనుకుపోయిన రేప్ కల్చర్ కు నిదర్శనమని ఆరోపించారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి హింసను సాధారణ విషయంగా చూపిస్తూ దాన్ని సమర్థిస్తున్నారు. వికృత మనస్తత్వాలను రెచ్చగొట్టేందుకు ఇలాంటి సైట్లు వేదికలుగా మారుతున్నాయిఁ అని ఆమె విమర్శించారు. గతంలోనూ మెలోని ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో ఆమె ముఖాన్ని అశ్లీల వీడియోలకు జోడించి ఆన్‌లైన్‌లో పెట్టిన తండ్రీకొడుకులపై ఆమె గత ఏడాది రూ. కోటి (100,000 యూరోలు) నష్టపరిహారం కోరుతూ దావా వేశారు.

వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఫికా లాంటి వెబ్‌సైట్లపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఆశ్చర్యకరంగా ఈ వెబ్‌సైట్ 2005 నుంచి పనిచేస్తున్నప్పటికీ ఇన్నాళ్లూ దానిపై చర్యలు తీసుకోలేదు. ఈ సైట్‌లో భర్తలే తమ భార్యల ఫొటోలను పంచుకోవడం, ఇతరుల భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్ ఫొటోలకు హస్తప్రయోగం చేసిన ఆధారాలను పోస్ట్ చేయడం వంటి వికృత చర్యలు ఉండేవని తెలిసింది.

ఈ సైట్ వల్ల నరకం అనుభవించిన మేరీ గలాటి అనే బాధితురాలు మాట్లాడుతూ ఁకేవలం పురుషులకు మాత్రమే సభ్యత్వం ఉన్న ఆ సైట్‌లోకి వెళ్లేందుకు నేను మా నాన్న గుర్తింపు కార్డు వాడాల్సి వచ్చింది. అక్కడ భర్తలు తమ భార్యల ఫొటోలను, బంధువుల ఫొటోలను షేర్ చేసేవారు. అంతకంటే దారుణంగా నాలుగైదేళ్ల చిన్నపిల్లల ఫొటోలను కూడా తండ్రులే అప్‌లోడ్ చేయడం చూశాను. వారి పాదాలు, శరీర భాగాల ఫొటోలు పెట్టి, వాటి కింద లైంగిక, పైశాచిక కామెంట్లు చేసేవారుఁ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Comment