ట్రంప్ ఆరోగ్యంపై యూఎస్ సోష‌ల్ మీడియాలో వింత ప్ర‌చారం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదంతో యూఎస్ ఓట‌ర్ల‌ను ఉత్స‌హ‌ప‌రించి రెండోసారి గ‌ద్దెక్కిన డొనాల్డ్ ట్రంప్..ప్ర‌తీకార సుంకాల పేరుతో ప్ర‌పంచ దేశాల‌పై ట్రేడ్ వార్ ప్ర‌క‌టించారు. అధికార పీఠం ఎక్కిన‌కానించి అమెరికా పాల‌న గాలికి వ‌దిలి వేసి ఇత‌ర దేశాల విష‌యాల్లో జోక్యం చేసుకుంటూ. ఎప్పుడు ప్రెస్ మీట్లు, ప‌లు దేశాల అధినేత‌ల‌తో బీజీ బీజీగా ఉంటూ, త‌న సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా త‌న శైలిలో ప్ర‌పంచ దేశాల మీద బుర‌ద‌జ‌ల్లుతూ పైశాచిక ఆనందాన్ని పొందే ట్రంప్‌..ప్ర‌స్తుతం ఎలాంటి అల‌జ‌డి లేకుండా ప్ర‌శాంతంగా ఉన్నారు. దీంతో ట్రంప్ రెండు రోజులుగా మౌనంగా ఉండ‌టంతో..ఆయ‌న‌ ఆరోగ్య ప‌రిస్థితి ప‌ట్ల అనేక ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో అమెరిక‌న్ సిటిజ‌న్స్ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రంప్ కు ఏమ‌న్నాయితే ప్రెసిడెంట్ ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి తాను సిద్ద‌మేన‌ని చెప్పిన మాట‌లు మ‌రింత ఊతమిస్తున్నాయి.

ఈక్ర‌మంలో కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యంపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ బయటి ప్రపంచానికి కనిపించక పోవడంతో ‘మిస్సింగ్‌’ వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. కాగా, ఇటీవల కాలంలో ట్రంప్‌ మీడియా ముందుకు రాలేదు.. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్‌’ సోషల్ ద్వారానే తెలియజేస్తున్నారు.. ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్‌ ఈవెంట్లను శ్వేత సౌధం షెడ్యూల్‌లో లేకపోవడంతో మరిన్ని అనుమానాలకు దారి తీసింది.

అయితే, డొనాల్డ్ ట్రంప్‌ అనారోగ్యంపై వార్తలు వస్తుండటం.. ఆయన చేతిపై గాయాలు ఉండటంతో పలువురు సోషల్‌ మీడియాలో ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటలుగా ట్రంప్‌ కనిపించట్లేదు.. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌లు పెట్టుకోలేదు.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అని ఓ నెటిజన్ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్టు పెట్టాడు. మరోవైపు నెట్టింట జరుగుతున్న ప్రచారం మొత్తం ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని అతడి ట్రూత్‌ సోషల్‌ పోస్టులు చెబుతున్నాయని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు రావడం లేదని పలువురు చెబుతున్నారు.

మరోవైపు, తన ఆరోగ్యంపై తరచూ వస్తున్న వార్తలపై ట్రంప్‌ వైద్యుడు సీన్‌ బార్బబెల్లా స్పందిస్తూ.. ఇటీవల ట్రంప్‌ చేతిపై కనిపించిన ఈ గాయాన్ని దాచడానికి చేతికి మేకప్‌ వేసుకొని కనిపించారన్నారు. తరచుగా కరచాలనం చేయడంతోటి.. ఆస్ప్రిన్‌ వాడటం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు. కానీ, డొనాల్డ్ ట్రంప్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చి చెప్పారు.

The post ట్రంప్ ఆరోగ్యంపై యూఎస్ సోష‌ల్ మీడియాలో వింత ప్ర‌చారం appeared first on Navatelangana.

Leave a Comment