జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
ఈ వర్షాల కారణంగా ముగ్గురుప్రాణాలు కోల్పోగా.. నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. రియాసి జిల్లాలోని మహోర్ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపోవడంతో పరిస్థితి గంభీరమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. నివాస భవనం నేలమట్టంపై ఉండటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది.
వరదలు వచ్చి, ఇళ్లకు, పలు నిర్మాణాలకు నష్టం కలిగినట్లు అధికారులు తెలిపారు.
సహాయక బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని తక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అలాగే, గల్లంతైన వ్యక్తులను ఆచూకీగా గుర్తించడానికి స్థానిక అధికారులు బృందాలను పంపినట్టు వెల్లడించారు.
ఉప్పొంగుతున్న నదులు
అదేవిధంగా,వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
శనివారం,ఆదివారం పూంఛ్,కిశ్త్‌వాడ్,జమ్మూ,రాంబాన్,ఉధంపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు దూరంగా వెళ్లాలని కోరారు. గత వారం రోజులుగా జమ్మూకశ్మీర్‌లో వర్షాలు విరామం లేకుండా కురుస్తున్నాయి. ఫలితంగా, ఇక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మచైల్ మాతా యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారులు మరియు ఇతర ప్రధాన మార్గాలు దెబ్బతిన్నాయి, దీని వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉధంపూర్ జిల్లాలోని జఖేనీ-చెనాని మధ్య కొండచరియలు విరిగిపోవడంతో 2,000కి పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక, ఇటీవల మచైల్ మాతా దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్టు, మరికొందరు గల్లంతయినట్టు తెలుస్తోంది. ఈ విషాదకర పరిణామాల నేపథ్యంలో అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
The post జమ్ముకశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. పది మంది మృతి appeared first on Visalaandhra.