ఈ మేరకు వారిద్దరి పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది ప్రభుత్వం.

Updated On : August 30, 2025 / 3:50 PM IST
Mlcs: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అజారుద్దీన్ లను ఖరారు చేసింది. ఈ మేరకు వారిద్దరి పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పుతో క్యాబినెట్ మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను సిఫారసు చేసింది. అయితే కోదండరామ్ కు మరోసారి అవకాశం ఇచ్చిన రేవంత్ సర్కార్.. అజారుద్దీన్ పేరును అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చింది. గతంలో సిఫారసు చేసిన అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు చోటు లభించింది.
కాగా, ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు వారి నియామకంపై స్టే విధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అజారుద్దీన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఇంట్రస్టింగ్ మారింది.