తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను నిర్ణయించింది. వీరిద్దరి పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ.. సంబంధిత ఫైలును గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. అయితే అజారుద్దీన్ పేరును ప్రభుత్వం అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చింది. గతంలో సిఫారసు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు చోటు లభించింది.
అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అజారుద్దీన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఎవర్నీ నిలబెడుతారనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతోంది.
The post గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్..! appeared first on Visalaandhra.