కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం రియాసి, రాంబాన్ జిల్లా రాజ్ గఢ్ లో మేఘం విస్పోటనం జరిగింది. భారీ వర్షాలు కువడంతో వరదలు ముంచెత్తాయి. మహోర్ ప్రాంతంలోని బద్ధర్ గ్రామంలో కొండచరియలు భవనంపై విరిగిపడడడంతో 10 మంది మృతి చెందారు. నజీర్ అహ్మద్ ఇంటిపై కొండచరియలు విరిగిపడడంతో ఆయన భార్య, ఐదుగురు పిల్లలు చనిపోయారు. ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కొండచరియలను తొలగించి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. రాంబన్ జిల్లా రాజ్‌గ్రా గ్రామంలో క్లౌడ్ బరస్ట్ జరగడంతో వరదలు ముంచెత్తాయి. వరదలలో గ్రామంతో పాటు పాఠశాల మునిగిపోవడంతో ఐదుగురు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. మృతులు ఓం రాజ్, విద్యా దేవి, ద్వారకానాథ్, మరొక వ్యక్తిగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Also Read : జ్వరేవ్, గాఫ్ ముందుకు

Leave a Comment