కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.7,324 కోట్ల డివిడెండ్‌

– Advertisement –

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ కేంద్రానికి భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2024-25కు గాను రూ.7,324.34 కోట్ల విలువ చేసే చెక్కును శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి అందజేశారు. ఈ సమావేశంలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజు, సంయుక్త కార్యదర్శి పర్షాంత్‌ కుమార్‌ గోయల్‌, ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్లు సత్‌ పాల్‌ భానూ, దినేష్‌ పంత్‌, రత్నాకర్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు. 69 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్‌ఐసీ 2025 మార్చి 31 నాటికి రూ.56.23 లక్షల కోట్ల ఆస్తి విలువను కలిగి ఉంది.

– Advertisement –

Leave a Comment