కీలక నిర్ణయం తీసుకున్న ద్రవిడ్.. ఆ జట్టు కోచ్ పదవికి గుడ్‌బై

– Advertisement –

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అభిమానులకు నిరాశ మిగిల్చింది. 14 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచుల్లోనే విజయం సాధించి.. టేబుల్‌లో 9వ స్థానంలో స్థిరపడింది. అయితే 19వ సీజన్‌కి ముందు ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) నిర్ణయం తీసుకున్నారు. గత సీజన్ ముందు వరకూ టీం ఇండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ద్రవిడ్ ఆ తర్వాత ఆర్ఆర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కాలికి గాయమైనప్పటికీ.. ఆయన వీల్ ఛైర్‌లో ఉండి జట్టును ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆయన కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయాన్ని ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.

‘‘ఐపిఎల్ 2026 సీజన్‌కు ముందే రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తన పదవి నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్‌తో ఆయన ప్రయాణం.. ఆటగాళ్లపై ఆయన ప్రభావం చాలా ఉంది. ఫ్రాంచైజీలో అసాధారణమైన సాంప్రదాయం నిలపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫ్రాంచైజీలో మరింత ఉన్నత స్థానం ఇస్తామన్నా.. తిరస్కరించారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు, అభిమానుల తరఫు నుంచి ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాం’’ అని ఆర్ఆర్ పోస్ట్ చేసింది.

Also Read : భారత హాకీ జట్టు శుభారంభం

– Advertisement –

Leave a Comment