ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర మరోసారి ఆకాశాన్నంటింది. పసిడి ప్రియులకు భారీ షాకిస్తూ, ఒక్కరోజులోనే ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈనాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1,640 పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. వెండి కూడా బంగారం బాటలోనే పయనించి, ధరల మోత మోగించింది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,950 ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,500 పెరిగి, రూ.96,200 వద్ద నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.మరోవైపు వెండి ధర కూడా పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండిపై ఒక్కరోజే రూ.1,100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,31,000కు ఎగబాకింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,05,100 వద్ద ట్రేడ్ అవుతుండగా, కిలో వెండి ధర రూ.1,21,000గా ఉంది.

Leave a Comment