ఇలాంటి సమయంలో నోరు మూసుకోవడమే మంచిది..

ఇలాంటి సమయంలో నోరు మూసుకోవడమే మంచిది..

Silence is strength: సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. అయితే అందరితో కలిసి ఉండటంవల్ల హ్యాపీగా ఉండలేం. కొందరు మాత్రమే కన్వీనెంట్ గా ఉంటారు. వీరితో కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. అయినా ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు కొందరు దీనిని ఆసరాగా తీసుకొని హేళన చేయడానికి ముందుకు వస్తారు. అలాగే పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ జీవితం అయోమయం కావడానికి కారణమవుతారు. అయితే మనం చేసే కొన్ని తప్పులే ఈ సమస్యలకు కారణాలు అవుతాయి. ఆ తప్పుల్లో ఈ 5 ముఖ్యమైనవి. ఈ ఐదు చోట్ల ఎక్కువగా మాట్లాడకుండా ఉండడమే మంచిది. అసలు ఈ సమయంలో మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రతి ఒక్కరికి బాధ కచ్చితంగా ఉంటుంది. ఇది ఏ సమయంలో వస్తుందో చెప్పలేం. ఒక్కోసారి బాధ ఎక్కువగా అయినప్పుడు ఏడుపు కూడా వస్తుంది. ఇలా ఏడుపు వచ్చినప్పుడు ఒంటరిగానే ఏడుస్తూ ఉండాలి. ఏడుస్తున్నప్పుడు మరో వ్యక్తి ఉంటే ఆ సమయంలో ఏం మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఏడ్చే ప్రతి వ్యక్తి తన బలహీనతలను బయటకు చెబుతూ ఉంటాడు. ఈ బలహీనతలను కొందరు ఆసరాగా చేసుకొని వారి జీవితంలో తప్పులు చేయడానికి కారకులుగా మారుతారు.

ప్రతి ఒక్కరి జీవితంలో కోపం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మనకు నచ్చని పరిస్థితులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఒక్కోసారి అదుపులోకి రాదు. అయితే ఇలాంటి కోపం వచ్చినప్పుడు మరో వ్యక్తి దగ్గరగా లేకుండా చూడాలి. ఎందుకంటే కోపం వచ్చిన సమయంలో మనకు తెలియకుండానే తప్పుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తిపై కూడా వాడరాని పదాలు వాడాల్సి వస్తుంది. అందువల్ల ఈ సమయంలో ఒంటరిగా ఉండడమే మంచిది. లేదా కోపం వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడమే మంచిది.

మనతో ఉండే స్నేహితులు, ఉద్యోగులు అందరూ మంచివారు అని అనుకుంటే పొరపాటే. వీరిలో కొందరు మాత్రమే అనుకూలంగా ఉంటారు. అయితే ఎవరు ఎలా ఉన్నా.. ఇతరులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కోసారి మనతో మంచిగా ఉంటూనే కొన్ని విషయాల్లో హేళన చేస్తూ ఉంటారు. లేదా మనల్ని ఎప్పుడూ కించపరుస్తూ ఉంటారు. ఇలాంటి వారితో ఎక్కువగా మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఇలాంటి వారికి ఏదైనా విషయం చెప్తే సందర్భాన్ని చూసి తప్పుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది.

ఒక్కోసారి స్నేహితులు.. ఉద్యోగులతో ఇష్ట గోష్టిగా మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి సమయంలో ఇతరులు మాట్లాడుతున్నారని మనం కూడా ఏదో ఒక విషయం చెబుతూ ఉంటాం. అయితే ఇదే సమయంలో మనకు తెలియకుండానే పర్సనల్ విషయాలను బయటపెడుతూ ఉంటాం. ఇలా అందరూ మాట్లాడుతున్నారు కదా అని.. మనం కూడా పర్సనల్ విషయాలను బయట పెట్టడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి.

[

Leave a Comment