ఇండియాకొస్తున్న టిక్ టాక్.. ఇక పండుగే పో

TikTok comeback India: సోషల్ మీడియాలో సంచలన విప్లవం సాధించిన TikTok.. గురించి మొబైల్ వాడిన ప్రతి ఒక్కరికి తెలిసిందే. చాలామంది ఇందులో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేశారు. కొందరు దీని ద్వారా ఉపాధి కూడా పొందారు. అయితే అయిదేళ్ల కింద భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది. పౌరుల భద్రత దృష్ట్యా ఈ యాప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు మరికొన్ని యాప్స్ ను లేకుండా చేసింది. అయితే ఇటీవల భారత్, చైనా మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ మళ్లీ వస్తుందన్న కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఇందులో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరుతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

సోషల్ మీడియా యూజర్స్ కు టిక్ టాక్ ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేది. కేవలం చిన్న వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేవారు. సినిమాలలో నటించాలని అనుకునే వారు టిక్ టాక్ ద్వారా ఎన్నో వీడియోలను చేసి అవకాశాలను పొందారు. యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఎంతో డబ్బు సంపాదించింది కూడా. అయితే తాజాగా టిక్ టాక్ భారత్లో రియంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ భారత్లో నెలకొల్పి కొందరిని నియమించుకోవాలని చూస్తోంది. ఈ యాప్ దేశంలో నిషేధం ఉన్నప్పటికీ ఇందులో కొందరిని నియమించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు Linkdin లో నియామకాల గురించి ప్రకటన చేసింది. కంటెంట్ మోడరేట్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ, వెల్ బీయింగ్ పార్ట్నర్షిప్ అండ్ ఆపరేషన్ లీడ్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ స్థానాలను నియమించుకోనున్నట్లు పేర్కొంది.

అయితే భారత ప్రభుత్వం ఇప్పటివరకు టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేయలేదు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ రెండింటిలోనూ టిక్ టాక్ యాప్ అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ఇవి తప్పుడు వార్తలని.. ఇలాంటివి విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కొందరు తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి ప్రకటనలు చేశారని తెలుపుతోంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత 2020 జూన్ లో భారత ప్రభుత్వం నిషేధం ప్రకటించినప్పటికీ.. 59 మొబైల్ ల్లో ఈ యాప్ అలాగే ఉంది. ఈ యాప్ మొబైల్లో ఉంటే వినియోగదారుడి సమాచారం పూర్తిగా సేకరిస్తుందని.. వీటితోపాటు మరికొన్ని యాప్స్ కూడా ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించింది. అందుకే టిక్ టాక్ తో పాటు.. మరికొన్ని యాప్స్ ను నిషేధించారు.

అయితే తాజాగా వెలువడిన ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు టిక్ టాక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఇకముందు కూడా తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉంటాయని తెలుపుతోంది.

[

Leave a Comment