Janhvi Kapoor: నేటి కాలంలో సెలబ్రిటీలు పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు. సరోగసి వంటి విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మెజార్టీ సెలబ్రిటీలు గర్భధారణ ను ఇష్టపడడం లేదు. అయితే ఈ సెలబ్రిటీ మాత్రం డిఫరెంట్. పైగా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లల్ని కంటుందట. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఆమె ఏమాత్రం సిగ్గుపడలేదు. ఓపెన్ గానే తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేసింది. ఇంతకీ ఆ కథానాయక ఎవరంటే..
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది దివంగత అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్. తెలుగులో దేవర సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. హిందీ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన పరం సుందరి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉంది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన జాన్వి… తన వైవాహిక జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ముగ్గురు పిల్లల్ని కంటాను
నేటి కాలంలో సెలబ్రిటీలు పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ కన్నా ఒకరితోనే ఆపివేస్తున్నారు. ఎవరో కొంతమంది మాత్రమే ఇద్దరినీ కంటున్నారు. కానీ జాన్వికపూర్ అలా కాదట. ఆమె ఏకంగా ముగ్గురు పిల్లల్ని కంటుందట..” నా లక్కీ నెంబర్ మూడు. వివాహం జరిగిన తర్వాత ముగ్గురు పిల్లల్ని కంటాను. వారిలో ఇద్దరు గొడవ పడుతుంటే మూడో బిడ్డ ఎవరికి సపోర్ట్ చేస్తాడో నేను చూస్తాను. సందర్భాన్ని బట్టి పిల్లల మద్దతు మారుతూ ఉంటుంది. నా ముగ్గురు బిడ్డలందరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. ఐకమత్యంగా కలిసి ఉంటారు. దాన్ని అలా చూస్తూ ఉండడం నాకు చాలా ఇష్టం. నాకు పెద్ద కుటుంబం అంటే ఆసక్తి. అందువల్లే ముగ్గురు పిల్లల్ని కనాలి అనుకుంటున్నానని” జాన్వీ వ్యాఖ్యానించింది. దేవర తర్వాత తెలుగులో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో జాన్వి కథానాయక పాత్ర పోషిస్తున్నది.. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.
అతనితో కలిసి ఏడడుగులు
జాన్వి కపూర్ ఇటీవల ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అతడు రాజకీయ నేపథ్యానికి చెందిన వాడని.. త్వరలోనే అతడిని ఆమె పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది. తండ్రి బోని కపూర్ వారిద్దరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అందువల్లే ఎక్కడికి వెళ్లినా అతడిని తీసుకెళ్తాందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తన ప్రియుడి తో కలిసి జాన్వి కపూర్ దర్శించుకున్నారు. తన సంబంధాన్ని బయట పెట్టారు. త్వరలోనే అతడితో కలిసి వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.