అల్లు అర్జున్ ఇంట్లో విషాదం… షూట్ నుంచి వచ్చేసిన బన్నీ…

అల్లు అర్జున్ ఇంట్లో విషాదం… షూట్ నుంచి వచ్చేసిన బన్నీ…

Allu Aravind Mother Passes Away: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది… ఇక తను ఇంతకుముందు చేసిన ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. మరి అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చే సినిమాలు అతని అభిమానులను అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్న అయితే చేస్తున్నాయి. కాబట్టి ఆయన చేసే సినిమాల మీద యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పాన్ వరల్డ్ లో ఈ సినిమా మీద అల్లు అర్జున్ భారీ ఆశలైతే పెట్టుకున్నాడు…

Also Read: బీసీసీఐ అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశాడు? అసలేం జరిగింది?

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ వాళ్ళ నాన్నమ్మ, అల్లు అరవింద్ వాళ్ల అమ్మ, అల్లు రామలింగయ్య భార్య అయిన అల్లు కనకరత్నం గారు 94 సంవత్సరాల వయస్సు లో వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటు గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటున్నారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఈరోజు ఉదయం ఆమె కన్నుమూశారు… ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబై లో అట్లీ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో బిజి గా ఉన్నాడు…

ఇక ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్ కి బయలుదేరాడు. ఇక ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు… అల్లు రామలింగయ్య గారు లేకపోవడంతో కనకరత్నం గారు చాలా రోజుల నుంచి ఒంటరిగా ఉంటున్నారు. ఆమె చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ గత కొద్ది రోజుల నుంచి హాస్పిటల్ లోనే ఉంటున్నారు.

ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో అల్లు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అల్లు అరవింద్ అయితే తన తల్లిని కోల్పోయిన బాధతో తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటికే అల్లు అరవింద్ దగ్గరికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు…

Leave a Comment