Watch Video: భక్తులను ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎక్కడంటే! – Telugu News | Srikakulam’s Stunning Kadamba Pushpa Ganesha Idol by Boruvanka Youth Club Captivates Devotees

వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి కవిటి మండలంలోని బోరువంక గ్రామంపైనే పడుతుంది. ఎందుకంటే ఆ గ్రామంలోని
ఉద్దానం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రతిసారీ వినూత్న రీతిలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటారు. ఇందులో భాగంగానే ప్రతి సారిలా ఈ ఏడాకి కూడా వినూత్న రీతిలో కదంభ పుష్పాలతో ప్రత్యేక గణపయ్యను ప్రతిష్టించారు. యూత్ క్లబ్‌కు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ మండపం దగ్గర ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. గ్రామ యువత ఉత్సాహంతో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేదికను విద్యుద్దీపాలతో, రంగురంగుల అలంకరణలతో అలంకరించారు. అయితే గురువారం MLC నర్తు రామారావు దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

పరిమాలాలు వెదజల్లే కదంభ పుష్పం అంటే లక్ష్మీ దేవి స్వరూపంగా అంతా భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలోను, ఇతర పూజలలోను కదంబ పుష్పాన్ని విరివిగా వాడుతారు. కదంబ వృక్షాన్ని ,కృష్ణ వృక్షంగాను పిలుస్తారు. వేదాలలోని ఈ పుష్పం గురించిన ప్రస్తావన ఉంది. అంతేకాదు పరిమిల భరితమైన కదంబ పుష్పాలను అత్తరు తయారీలో వినియోగిస్తారు. వీటి ఆకు, చెట్టు బెరడు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న కదంభం పుష్పాలతో తీర్చిదిద్దిన గణనాథుడి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. యూత్‌ క్లబ్‌ సభ్యులు ప్రతిష్టించిన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు సమీప గ్రామాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు.

సాధారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు, వాడ భక్తి పారవశ్యం కనిపిస్తూ ఉంటుంది. అయితే కొందరు మాత్రం ప్రచార ఆర్భాటాలకు పోయి వినాయకుడి అసలు రూపాన్ని మార్చేస్తూ గణపతిని సిక్స్ ప్యాక్‌లో, లేదా డాక్టర్‌ గా, క్రికెటర్, తమ ఫేవరెట్ సినీ హీరోగా ఇలా తమకు నచ్చిన రూపాల్లో విగ్రహాన్ని యారు చేసి మండపాల్లో పూజిస్తారు. బోరువంక గ్రామానికి చెందిన ఉద్దానం యూత్ క్లబ్ మాత్రం వినాయకుడు ఆసలు రూపాన్ని అలాగే ప్రదర్శిస్తూ. ఎంతో విశిష్టమైన కదంబ పుష్పాలను విగ్రహానికి అద్దడం ద్వారా మరింత ఆధ్యాత్మికతను జోడించారు. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కదంబ వృక్షం, పుష్పం విశిష్టత, ప్రత్యేకత అందరికీ తెలిసేలా ఫ్లెక్సీ నీ ఏర్పాటు చేయటంతో భక్తులు వాటి విశిష్టతను చదివి తెలుసుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment