Samir Rizvi: యూపీ ప్రీమియర్ లీగ్ 2025లో సమీర్ రిజ్వి బ్యాట్ గర్జిస్తోంది. ఈ లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సమీర్ మరోసారి సిక్స్‌లు, ఫోర్లు బాదాడు. ఈరోజు లక్నో ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమీర్ రిజ్వి కేవలం 32 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి జట్టుకు 8 వికెట్ల విజయాన్ని అందించాడు. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కాన్పూర్ జట్టు సమీర్ మెరుపు బ్యాటింగ్ కారణంగా కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
11 బంతుల్లో 7 సిక్సర్లు..
బ్యాటింగ్‌కు దిగిన సమీర్ రిజ్వి ఆటను చాలా స్లోగా ప్రారంభించాడు. ఆ విధంగా మొదటి 15 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఆ తర్వాత లక్నో బౌలర్లపై దాడి చేయడం ప్రారంభించిన సమీర్ రిజ్వి తరువాతి 17 బంతుల్లో 9 సిక్సర్లు బాదాడు. గొప్ప విషయం ఏమిటంటే చివరి 11 బంతుల్లో 7 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. సమీర్ రిజ్వి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. తన జట్టుకు విజయం అందించిన తర్వాతే తిరిగి వచ్చాడు.
ఇవి కూడా చదవండి
Samir rizvi🔥🔥#IPL2024Auction #IPL2024 #IPLAuctiononJioCinema #IPLAuctionOnStar #samirrizvi #channisuperkings #csk pic.twitter.com/02opkg0NyF
— Luckysolanki45 (@LuckySolanki45) December 19, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..