Video: చూస్తుండగానే కుప్పకూలిన F-16 ఫైటర్‌ జెట్‌..! అగ్నికి ఆహుతైన పైలెట్‌ – Telugu News | Tragic F 16 Crash During Rehearsal Cancels Radom Air Show Pilot Lost his Life

గురువారం సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో వైమానిక ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ మరణించాడు. ఈ విషాదం తర్వాత వారాంతంలో జరగాల్సిన రాడోమ్ ఎయిర్‌షోను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. జెట్ రన్‌వేపై కూలిపోవడం వల్ల నష్టం వాటిల్లిందని నివేదికలు తెలిపాయి. ప్రభుత్వ ప్రతినిధి ఆడమ్ స్జ్లాప్కా ఎక్స్‌ వేదికగా పైలట్ మరణాన్ని ధృవీకరించారు. రక్షణ మంత్రి వ్లాడిస్లా కోసినియాక్-కామిస్జ్ క్రాష్ సైట్‌కు వెళుతున్నారని తెలిపారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫుటేజ్‌లో జెట్‌ నేలను ఢీకొట్టడంతో మంటల్లో పూర్తిగా దగ్ధమైనట్లు కనిపించింది. కోసినియాక్-కామిస్జ్ తరువాత సంఘటన స్థలం నుండి ఎక్స్‌లో మరణాన్ని ధృవీకరిస్తూ పోస్ట్ చేశారు. పైలట్‌కు నివాళులర్పించారు. “F-16 ప్రమాదంలో ఒక పోలిష్ ఆర్మీ పైలట్ మరణించారు. అతను ఎల్లప్పుడూ మాతృభూమికి అంకితభావం, గొప్ప ధైర్యంతో సేవ చేసే అధికారి. నేను అతని జ్ఞాపకార్థం నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి, ప్రియమైనవారికి, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది వైమానిక దళానికి, మొత్తం పోలిష్ సైన్యానికి తీవ్ర నష్టం” అని ఆయన రాశారు.

రాడో ఎయిర్ షో రద్దు

ఈ విషాదం నేపథ్యంలో వారాంతంలో జరగాల్సిన రాడోమ్ ఎయిర్ షో రద్దు చేశారు. రక్షణ మంత్రి ప్రమాద స్థలాన్ని సందర్శించి పైలట్ మృతికి నివాళి అర్పించారు. ఆయనను అంకితభావం, ధైర్యంతో తన దేశానికి సేవ చేసిన అధికారిగా అభివర్ణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Comment