మేషం: ఈ రాశికి ప్రస్తుతం శుక్ర, గురు, బుధ గ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం గరిష్ఠంగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటి అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది.
వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారంతో పాటు ధన స్థానంలో గురువు, ధన స్థానంలో బుధుడి సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
తుల: ఈ రాశికి గురు, శుక్ర, బుధులు వరుసగా భాగ్య, దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందు వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా ఆదాయం వృద్ది చెంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లతో సహా అనేక అవకాశాలు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిస్తాయి. ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ధనుస్సు: ఈ రాశికి సప్తమ, అష్టమ, భాగ్య స్థానాల్లో వరుసగా గురు, శుక్ర, బుధుల సంచారం వల్ల విపరీత రాజయోగాలు, మహా భాగ్య యోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉన్నత పదవులు లభించడంతో పాటు, జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
మకరం: ఈ రాశికి 6, 7, 8 స్థానాల్లో వరుసగా శుక్ర, గురు, బుధులు సంచారం వల్ల పూర్తి స్థాయిలో శుభాధియోగం కలిగింది. రాజ యోగాలు, ధన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు అనేక మార్గాలో ఆదాయం వృద్ధి చెందుతుంది. జీతభత్యాలు పెరుగుతాయి. రాబడి అంచనాల్ని మించుతుంది.. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి.
మీనం: ఈ రాశికి 4, 5, 6 స్థానాల్లో గురు, శుక్ర, బుధుల సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులు, ప్రయత్నాలన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు ఎక్కువగా వింటారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.