Samsung and Apple won Best In Tech Awards 2025

– Advertisement –

న్యూఢిల్లీ : భారతదేశం అత్యుత్తమ టెక్ ఉత్పత్తులను గౌరవించే ’బెస్ట్ ఇన్ టెక్ అవార్డ్ (బిఐటిఎ) 2025’ విజేతలను ప్రకటించారు. కస్టమర్ రివ్యూలు, నిపుణుల తీర్పు, కమ్యూనిటీ ఓటింగ్ ఆధారంగా జరిగిన ఈ ఎంపికలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ’స్మార్ట్‌ఫోన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని గెలుచుకుంది. మరోవైపు యాపిల్ అత్యధికంగా బ్రౌజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. కెమెరా, ఆడియో, కంప్యూటింగ్, వినోద విభాగాల్లో సోనీ, వన్‌ప్లస్, హెచ్‌పి, కానన్, షావోమి వంటి బ్రాండ్లు కూడా పలు అవార్డులను కైవసం చేసుకున్నాయి. మార్కెట్‌లో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న గాడ్జెట్‌లకు ఈ అవార్డులు నిజమైన గుర్తింపునిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

 

– Advertisement –

Leave a Comment