ఇది దేశానికి నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందిస్తుంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ గిగావాట్ స్థాయి ఏఐ-రెడీ డేటా సెంటర్లను నిర్మిస్తుంది.

Reliance Intelligence
Updated On : August 29, 2025 / 3:20 PM IST
Reliance Intelligence: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ శుక్రవారం రిలయన్స్ ఇంటెలిజెన్స్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇది దేశానికి నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందిస్తుంది.
“రిలయన్స్ ఇంటెలిజెన్స్ గిగావాట్ (విద్యుత్ శక్తిని కొలిచే ప్రమాణం) స్థాయి ఏఐ-రెడీ డేటా సెంటర్లను నిర్మిస్తుంది. వీటికి గ్రీన్ ఎనర్జీతో విద్యుత్ సరఫరా ఉంటుంది. గుజరాత్‌లో జామ్‌నగర్‌లో డేటా సెంటర్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది” అని ముకేశ్ అంబానీ అన్నారు. డేటా సెంటర్ అంటే డేటాను నిల్వ, ప్రాసెస్, పంపిణీ చేసే సదుపాయాలు. (Reliance Intelligence)