Pawan Kalyan Sugali Preeti Case: సుగాలి ప్రీతి కేసులో తేలింది ఇదే.. పవన్ కళ్యాణ్ సంచలనం!

Pawan Kalyan Sugali Preeti Case: సుగాలి ప్రీతి కేసులో తేలింది ఇదే.. పవన్ కళ్యాణ్ సంచలనం!

Pawan Kalyan Sugali Preeti Case: అసలు సుగాలి ప్రీతి( sugali Preeti ) కేసులో ఏం జరిగింది? ఈ కేసులో సాక్షాలను తారుమారు చేశారా? సిబిఐని ప్రభావితం చేశారా? అసలు ఈ కేసు తేలేకపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే మరుగున పడిపోయిన ఈ కేసును తెరపైకి తెచ్చింది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ కుటుంబ బాధను తెలుసుకొని పరామర్శించారు. ఆర్థిక సాయం చేశారు. ఆ కుటుంబాన్ని వైసిపి ప్రభుత్వం ఆదుకునేలా ఒత్తిడి పెంచారు. సిబిఐ దర్యాప్తునకు కారణం అయ్యారు. అయినా సరే ఇప్పుడు సుగాలి ప్రీతి కుటుంబం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంది. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగింది ఈ ఘటన. అప్పుడే వైసిపి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కానీ సుగాలి ప్రీతి కుటుంబం మాత్రం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

* టిడిపి హయాంలో..
టిడిపి( Telugu Desam Party) ప్రభుత్వ హయాంలో.. 2017లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో అప్పటి ప్రభుత్వం స్పందించింది. పోలీస్ కేసు నమోదు చేసింది. నిందితులు అరెస్ట్ అయ్యారు. 23 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు. తరువాత వారికి బెయిల్ లభించింది. బయటకు వచ్చేసారు. ఈ నేపథ్యంలో అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. తరువాత అధికారంలోకి వచ్చింది. ఈ కేసు మాత్రం ముందుకు సాగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సాయం అందించారు. వైసిపి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచగలిగారు. సిబిఐ దర్యాప్తు ఏర్పాటు అయ్యేలా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే ఫైల్ పై సంతకం చేస్తామని.. దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీపై తాజాగా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

* సంచలన ఆరోపణలు..
నిన్ననే సుగాలి ప్రీతి తల్లి పార్వతి( Parvati ) మీడియా ముందుకు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. దీనిపై తాజాగా స్పందించారు పవన్ కళ్యాణ్. విశాఖలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై మాట్లాడారు. తాను డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుగాలి ప్రీతి కేసు పై సిఐడి చీఫ్ తో మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్ర డిజిపి తో పాటు హోం మంత్రితో సైతం చర్చించినట్లు వివరించారు. అయితే అనుమానితుల డీఎన్ఏలు సరిపోవడం లేదని తేలిందని.. సాక్షాలు తారుమారు చేశారని.. వైసిపి హయాంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారిందని.. అందులో భాగంగానే సాక్షాలు తారుమారు చేశారని చెప్పారు. గత ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసిందని.. లెటర్ ఇచ్చి లాకర్ లో పెట్టిందని చెప్పారు పవన్ కళ్యాణ్. కేసును నిష్పక్షపాతంగా విచారించి నిందితులకు కట్టిన శిక్ష పడేలా త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

* పవన్ స్పందన ఇది..
మరోవైపు పవన్ కళ్యాణ్ తాము స్పందించిన తర్వాతే ఈ కేసు కదలిక వచ్చిందని.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. నిన్న జరిగిన జనసేన సమావేశంలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.’ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం రోడ్లు మీదకు రావడానికి ఎవరూ సాహసించని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సిబిఐకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎక్కడ ఎకరం రెండు కోట్ల వరకు ఉంటుంది. కర్నూలు నగరంలోని కల్లూరు దగ్గర ఐదు సెంట్ల ఇంటి స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇదంతా రాజకీయపరంగా తాను తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితమే’ అంటూ చెప్పుకొచ్చారు పవన్. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment