OG Suvvi Suvvi Song Copy: అడ్డంగా దొరికిపోయిన తమన్..’ఓజీ’ లోని ‘సువ్వి సువ్వి’ పాట కూడా కాపీ యేనా?

OG Suvvi Suvvi Song Copy: టాలీవుడ్ లో సంగీత దర్శకుడు తమన్(SS Thaman) ని నెటిజెన్స్ అందరూ కాపీ క్యాట్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన సినిమాకు సంబంధించిన పాట విడుదలైతే చాలు, నెటిజెన్స్ వెంటనే ఆ పాటకు ఒరిజినల్ ఇదేనంటూ ఆధారాలతో సహా పెట్టేస్తుంటారు. హిందీ, తమిళం, ఇంగ్లీష్ ఇలా భాషతో సంబంధం లేకుండా, ఎక్కడైతే మంచి ట్యూన్ దొరుకుంటుందో అక్కడ ఈయన తస్కరించి ట్యూన్ అందిస్తుంటాడని తమన్ పై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ ఎదురు అవుతూ ఉంటాయి. ఈ నెగటివిటీ ఆయన వరకు చేరింది కానీ, ఏనాడు కూడా దానిని తలకి ఎక్కించుకోలేదు. తన విధానం కి తగ్గట్టుగానే పాటలను కంపోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) క్రేజ్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) కి ఆయన సంగీతం అందించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఆ రెండు పాటలు విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేస్తూ కంపోజ్ చేసిన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ పాటని హిందీ చిత్రం ‘బేబీ జాన్’ లోని థీమ్ మ్యూజిక్ ని నుండి కొంత ట్యూన్ కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ పాట విడుదలైన రోజునే ఆధారాలతో సహా బయటపెట్టి విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఓజీ చిత్రం నుండి ‘సువ్వి సువ్వి’ అనే పాట విడుదలైంది. ఈ పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇది కూడా కాపీ నే అని మరోసారి ఆధారాలతో సహా తమన్ ని నెటిజెన్స్ అడ్డంగా బుక్ చేసేశారు. యంగ్ హీరో నందు నటించిన ‘సవారి’ అనే చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

ఈ చిత్రం లోని ‘ఉండిపోవా నువ్విలా..రెండు కళ్ల లోపల’ అంటూ సాగే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలోని ఒక బీట్ ని థమన్ కాపీ కొట్టి ‘సువ్వి..సువ్వి’ పాటను కంపోజ్ చేసాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆధారాలతో సహా బయటపెట్టి తమన్ ని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఫేక్ ట్యూన్స్ ఇవ్వడం అవసరమా?, నిజాయితీగా ఒక ట్యూన్ కూడా కట్టలేవా అంటూ సోషల్ మీడియా లో తమన్ పై నాన్ స్టాప్ గా ట్రోల్స్ కురుస్తూనే ఉన్నాయి. ఇకపోతే ‘ఓజీ’ చిత్రం వచ్చే నెల 25 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.

Leave a Comment