Kotamreddy Sridhar Reddy: లేడీ డాన్ తో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర.. సంచలన వీడియో

Kotamreddy Sridhar Reddy: రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. కానీ అప్పుడప్పుడు ప్రత్యర్ధులు హత్యా రాజకీయాలకు కూడా పాల్పడుతుంటారు. తెలుగు నాట ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో హత్యా రాజకీయాలు జోరుగా సాగాయి. అప్పట్లో ఒక ప్రాంతంలో విపరీతంగా నేరమయ రాజకీయాలు చోటు చేసుకునేవి. 2012 వరకు ఈ తరహా రాజకీయాలు జోరుగా సాగాయి. ఆ తర్వాత పరిస్థితిలో కొంతమేర మార్పు వచ్చింది. అయినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు రౌడీ షీటర్లు.. అసాంఘిక శక్తులతో అంట కాగుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని పావుల మాదిరిగా వాడుకుంటున్నారు. అయితే అప్పటిదాకా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఉపయోగపడిన రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు.. ఆ తర్వాత తమ అసలు రంగును బయటపెడుతున్నారు. వారు కూడా తమదైన శైలిలో రాజకీయాలు చేస్తూ.. సభ్య సమాజాన్ని ముక్కున వేలేసుకునే విధంగా చేస్తున్నారు

Also Read: ఎమ్మెల్యే హత్యకే కుట్ర.. ఏపీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

తెలంగాణ రాష్ట్రంలో పోస్తే ఆంధ్రాలో రాజకీయాలలో నేరమయ వ్యక్తులు ఎక్కువ. జరిగిన సంఘటనలు కూడా పై ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా నెల్లూరులో అరుణ అనే ఒక నేరమయ చరిత్ర ఉన్న మహిళ సాగించిన ఆగడాల గురించి ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంత కాదు అరుణ తన స్నేహితుడు శ్రీకాంత్ అనే రౌడీషీటర్ ను బయటకు తీసుకురావడానికి అనేక వ్యవస్థలను వాడుకున్నారు. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆమె చక్రం తిప్పి శ్రీకాంత్ ను బయటికి తీసుకొచ్చారు. అంతేకాదు ఆసుపత్రిలో అతడితో సరస సల్లాపాలు కూడా ఆడారు. ఆ తర్వాత అరుణ వ్యవహారం గురించి మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ముగియలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

శ్రీకాంత్ ను అరుణ బయటికి తీసుకొచ్చింది కొంతమంది వ్యక్తులను హత్య చేయడానికి అని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది బయటపడలేదు. అయితే ఇప్పుడు వారిలో ప్రధానమైన వ్యక్తి నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియో ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బే డబ్బు అన్నట్టుగా కొందరు మాట్లాడుకుంటున్న వీడియో ప్రకంపనలను సృష్టిస్తుంది. ఆయనను హతమార్చేందుకు కొందరు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ ప్లాన్ చేసింది అరుణ అని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో కనిపిస్తున్న ఒక రౌడీషీటర్ శ్రీకాంత్ కు అత్యంత దగ్గర వ్యక్తి. మరో వ్యక్తి శ్రీకాంత్ కు ప్రధాన అనుచరుడు. వీరంతా కూడా అరుణకు అత్యంత సన్నిహిత వ్యక్తులు. ఇటీవల నెల్లూరులో మద్యం తాగి వారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య గురించి మాట్లాడటం విశేషం. ఈ వీడియో బయటికి రావడంతో నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య గురించి మాట్లాడిన నేపథ్యంలో.. విచారణ చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ ను అరుణ బైటికి తీసుకురావడానికి ప్రధాన కారణం ఇద్దరు వ్యక్తులను అంతం చేయడానికి అని.. అందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారని.. ఈ వీడియో ద్వారా అది బయటపడిందని నెల్లూరు లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీనిపై మాట్లాడేందుకు వారు నిరాకరిస్తున్నారు.

Leave a Comment