Hyderabad Beach: సముద్రమే లేని హైదరాబాదుకు బీచ్.. ఇది ఎలా సాధ్యమవుతోందంటే..

Hyderabad Beach: కృత్రిమంగా చిన్నపాటి సరస్సులను సృష్టించవచ్చు. కట్టడాలను నిర్మించవచ్చు. అడవులను కూడా రూపొందించవచ్చు. కానీ బీచ్ సాధ్యం కాదు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే బీచ్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. మనదేశంలో సముద్రతీర ప్రాంతాలలో మాత్రమే బీచ్ లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాలలో బీచ్ లు ఉన్నాయి. అండమాన్ నికోబార్ వంటి ప్రాంతంలో కూడా బీచ్ లు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో సముద్రాలు ఉన్నాయి. సముద్రాలు విస్తారంగా ఉన్న ప్రాంతాలలో బీచ్ లు ఉంటాయి.

Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది

పర్యాటకంగా..

బీచ్ లు ఉన్న ప్రాంతాలలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. పర్యాటకంగా ఈ ప్రాంతాలు విస్తారంగా అభివృద్ధి చెందాయి. గోవా, కేరళ లాంటి రాష్ట్రలయితే కేవలం పర్యాటకం ద్వారానే అత్యంత విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తునాయి. అయితే మన దేశంలో రెండవ ఆర్థిక రాజధానిగా పేరుపొందిన హైదరాబాద్ నగరానికి బీచ్ లేదు. హైదరాబాద్ నగరంలో విస్తారమైన సరస్సులు ఉన్నప్పటికీ.. బీచ్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి బీచ్ రాబోతోంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం.

ఎలా సాధ్యం

హైదరాబాదు నగరంలో బీచ్ ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతుంది. హైదరాబాదు నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్న కొత్వాల్ గూడ లో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. 35 ఎకరాల్లో దాదాపు 225 కోట్ల ఖర్చుతో బీచ్ ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలవుతుంది. కృత్రిమంగా ఏర్పాటు చేసే బీచ్ లో ఫ్లూటింగ్ విలాస్, లగ్జరీ హోటల్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుట్ కోర్టులు వంటివి ఏర్పాటు చేస్తారు. అయితే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో నిర్మాణం కానుంది. ఆ స్థాయిలో నీటిని ఎలా నిలువ చేస్తారు.. ఇసుకను ఎక్కడినుంచి తీసుకొస్తారు.. నీటి నిల్వకు ఎలాంటి పద్ధతులను అవలంబిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే కృత్రిమ బీచ్ లు ప్రపంచంలో కొత్తవి కాకపోయినప్పటికీ.. తెలుగు రాష్ట్రంలో మాత్రం ఇదే ప్రథమం. దీని ద్వారా పర్యాటకంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత భారత రాష్ట్ర సమితి వెంటనే రెస్పాండ్ అయింది. రాష్ట్రంలో వరదలు తీవ్రస్థాయిలో ఉంటే.. ప్రభుత్వం ఇలా కృత్రిమ బీచ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మండిపడుతోంది.

Leave a Comment