పెరుగుతో కలిపి బెల్లం తినడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. పెరుగు, బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పెరుగు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. కడుపు సమస్యలు, వికారం, మలబద్ధకం, వాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, ప్రతిరోజూ ఒక గిన్నె పెరుగు, బెల్లం తినండి.
పెరుగు, బెల్లం కలిపి తినటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు సమస్యలను నయం చేస్తుంది. బరువు తగ్గడానికి పెరుగు, బెల్లం కలిపి తినమని నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఇది శరీరంలో పోషక లోపాన్ని నివారిస్తుంది. శరీరంలో రక్తహీనతను నయం చేయడానికి బెల్లం తినవచ్చు. బెల్లం రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది.
పెరుగు, బెల్లం మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
పెరుగును బెల్లం తో కలిపి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత సులభంగా నయమవుతుంది. పెరుగు, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు, బెల్లం మిశ్రమం ద్వారా ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది.
పెరుగులో బెల్లం కలిపి తింటే రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నాడీ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. బీపీ కంట్రోల్ అవుతుంది. హైబీపీ తగ్గుతుంది. పెరుగు, బెల్లం మిశ్రమంలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
[