Bullet Train: బుల్లెట్ రైలు.. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు దశ తిరిగింది

Bullet Train: బుల్లెట్ రైలు.. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు దశ తిరిగింది

Bullet Train: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. అన్ని విధాలా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక ప్రాజెక్టులు ఇచ్చి ఉదారంగా ఆదుకుంటోంది. ఆంధ్రుల కలల రాజధానికి ఇతోధికంగా సాయపడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణానికి సైతం ముందుకు వచ్చింది. చాలా ప్రాజెక్టులను అమరావతికి కేటాయించింది. తాజాగా బుల్లెట్ రైలు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్- చెన్నై కారీడార్.. వయా అమరావతి మీదుగా అలైన్మెంట్ కు ఆమోదం లభించింది. ఈ కారిడార్ లో ఏపీకి సంబంధించి 8 రైల్వేస్టేషన్లో ఉండనున్నాయి. తెలంగాణలో ఓ ఆరు రైల్వేస్టేషన్లో కలుపుతూ దీనిని నిర్మించనున్నారు. మరోవైపు సీమ జిల్లాల నుంచి హైదరాబాద్, బెంగళూరు కారిడార్ కు సైతం ప్రాథమిక స్థాయిలో గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.

Also Read: ఎమ్మెల్యే హత్యకే కుట్ర.. ఏపీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

* హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్..
తమిళనాడు రాజధాని చెన్నై( Chennai), ఏపీ రాజధాని, తెలంగాణ రాజధాని హైదరాబాద్ను కలుపుతూ హై స్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపడతారు. దీనికి ప్రాథమికంగా ఆమోదం తెలిపింది రైల్వే శాఖ. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ నడవనుంది. ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమ ప్రజలకు ఇది శుభవార్త. ఎందుకంటే రాయలసీమ జిల్లాలకు అమరావతి రాజధాని దూరప్రాంతంగా ఉంది. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే తక్కువ సమయంలోనే రాజధానికి చేరుకోవచ్చు. ఇంకోవైపు హైదరాబాద్, మరోవైపు చెన్నై, బెంగళూరు మెట్రో నగరాలను కలుపుతూ ఈ ప్రత్యేక కారిడార్ ఏర్పాటు కానుంది. తద్వారా దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాలను కలుపుతూ మరిన్ని బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అదే జరిగితే రవాణా మరింత సులభతరం కానుంది. ప్రయాణం సైతం చాలా సులభతరం కానున్నాయి.

* వేర్వేరు కారిడార్లు
మరోవైపు శంషాబాద్( Shamshabad) నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేరువేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ వయా అమరావతి గా ఉంటుంది. 839.5 కిలోమీటర్లు ఒక అలైన్మెంట్.. 749.5 కిలోమీటర్లు మరో అలైన్మెంట్.. 744.5 కిలోమీటర్లతో మూడో అలైన్మెంట్ ను ప్రాథమికంగా పరిశీలించారు. ముందుగా ఏపీలో 8 రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. అమరావతి గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ స్టేషన్లు ముందుగా నిర్మించనున్నారు. మొత్తానికి అయితే ఈ బుల్లెట్ రైళ్లతో ఏపీకి, ముఖ్యంగా ప్రపంచ నగరాలకు ధీటుగా నిర్మితం కానున్న అమరావతికి కొత్త మణిహారంగా చెప్పవచ్చు.

Leave a Comment