ప్రతి నెల మాదిరిగానే, సెప్టెంబర్ 2025 లో కూడా కొన్ని బ్యాంకు సెలవులు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేకుంటే చివరి క్షణంలో ఇబ్బంది పడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 2025 అధికారిక బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం, పండుగలు, రాష్ట్ర స్థాయి సందర్భాలు, వారాంతపు సెలవులు సహా మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. కొండముచ్చు ముందు అమ్మాయి రీల్స్.. చివరకు ఏమైందంటే..
ఆర్బిఐ నిబంధనల ప్రకారం, అన్ని బ్యాంకులలో సెలవులు ఒకేలా ఉండవు. ప్రతి రాష్ట్రంలో స్థానిక పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాల ఆధారంగా సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. అంటే ఒక రాష్ట్రంలో తెరిచి ఉన్న బ్యాంకులు మరొక రాష్ట్రంలో మూసి ఉండవచ్చు. అందువల్ల, మీ రాష్ట్ర సెలవుల జాబితాను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే మీరు బ్యాంకుకు వెళ్లడం ముఖ్యం.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్ 30న పాఠశాలలు బంద్.. వరుసగా 2 రోజులు సెలవులు
- సెప్టెంబర్ 3, బుధవారం: కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 4, గురువారం: ఫస్ట్ ఓనమ్ ఫెస్టవల్ సందర్భంగా కేరళలో బ్యాంకులకు హాలీడే ఇచ్చారు.
- సెప్టెంబర్ 5, శుక్రవారం: ఈద్ ఇ మిలాద్, తిరువోన్నమ్ సందర్భంగా గుజరాత్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, హైదరాబాద్, విజయవాడ, మణిపూర్, జమ్ము, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- సెప్టెంబర్ 6, శనివారం: ఈద్- ఇ మిలాద్, ఇంద్రజాత్ర సందర్భంగా సిక్కిం, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- సెప్టెండర్ 7, ఆదివారం: ఈరోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 12, శుక్రవారం: ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- సెప్టెంబర్ 13, శనివారం: రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- సెప్టెంబర్ 14, ఆదివారం: బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 21, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ హాలీడే ఉంటుంది.
- సెప్టెంబర్ 22, సోమవారం: నవరాత్రి స్థాపన సందర్బంగా రాజస్థాన్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 23, మంగళవారం: మహరాజ్ హరి సింగ్ జీ జయంతి సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 27, శనివారం: నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 28, ఆదివారం: ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 29, సోమవారం : మహా సప్తమి, దుర్గా పూజను జరుపుకోవడానికి త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 30, మంగళవారం: త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మహా అష్టమి / దుర్గాష్టమి / దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
ఇది కూడా చదవండి: DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్ కోసం ఏది బెస్ట్?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి