Site icon Desha Disha

వన్డే కెరీర్‌లో సెంచరీ లేదు.. కట్‌చేస్తే.. అత్యధిక పరుగులతో హల్చల్ చేసిన ఏడుగురు.. లిస్ట్‌లో మనోడు.. – Telugu News | From misbah to wasim akram and ravindra jadeja these 7 players most runs in odi without century

వన్డే కెరీర్‌లో సెంచరీ లేదు.. కట్‌చేస్తే.. అత్యధిక పరుగులతో హల్చల్ చేసిన ఏడుగురు.. లిస్ట్‌లో మనోడు.. – Telugu News | From misbah to wasim akram and ravindra jadeja these 7 players most runs in odi without century

Most Runs In ODI Without Hundred: క్రికెట్‌లో ఏ ఆటగాడికైనా పరుగులు చేయడం ముఖ్యం. అయితే, సెంచరీ పూర్తి చేసినా చేయకపోయినా, జట్టు గెలవడం ముఖ్యం. అదే సమయంలో తమ కెరీర్‌లో సెంచరీ సాధించని ప్లేయర్లు కూడా ఉన్నారు. ఇక వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయని ఆటగాళ్ల గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే, వీరు సెంచరీ చేకపోయినా, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 7 ఆటగాళ్లలో నిలవడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్‌కు చెందినవారే. అదే సమయంలో, భారత జట్ట నుంచి ఒక ఆల్ రౌండర్ పేరు కూడా ఉంది.

1- మిస్బా-ఉల్-హక్: ఈ జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు మిస్బా-ఉల్-హక్ పేరు అగ్రస్థానంలో ఉంది. మిస్బా 162 వన్డే మ్యాచ్‌ల్లో 43.40 స్ట్రైక్ రేట్‌తో 5,122 పరుగులు చేశాడు. వన్డేల్లో ఈ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 96 నాటౌట్.

2. వసీం అక్రమ్: ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ జట్టు ఆటగాడు వసీం అక్రమ్ పేరు రెండవ స్థానంలో ఉంది. వసీం అక్రమ్ 356 మ్యాచ్‌ల్లో 3,717 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు జట్టుకు వెనుక నుంచి బలాన్ని ఇచ్చేవాడు. వన్డేల్లో ఈ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 86 పరుగులు.

ఇవి కూడా చదవండి

3- మోయిన్ ఖాన్: వన్డేల్లో సెంచరీ చేయకుండా అత్యధిక పరుగులు చేసిన వారిలో పాకిస్తాన్ క్రికెటర్ మూడవ స్థానంలో ఉన్నాడు. మొయిన్ ఖాన్ 219 వన్డే మ్యాచ్‌ల్లో 3,266 పరుగులు చేశాడు. వన్డేల్లో ఈ పాకిస్తాన్ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 72 నాటౌట్ పరుగులు.

4- హీత్ స్ట్రీక్: హీత్ స్ట్రీక్ ఒక బలమైన ఫాస్ట్-మీడియం బౌలర్. ఈ జింబాబ్వే ఆటగాడు సెప్టెంబర్ 2023లో మరణించాడు. ఈ ఆటగాడు జింబాబ్వే తరపున 189 మ్యాచ్‌ల్లో 2,943 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 79 నాటౌట్.

5- రవీంద్ర జడేజా: భారత జట్టు ఆల్ రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. జడేజా 204 వన్డే మ్యాచ్‌ల్లో 32.62 సగటుతో 2,806 పరుగులు చేశాడు. జడేజా వన్డేల్లో 138 పరుగులు చేస్తే, అతను ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంటాడు. వన్డే క్రికెట్‌లో ఈ భారత ఆల్ రౌండర్ అత్యుత్తమ స్కోరు 87 పరుగులు. జడేజా వన్డేల్లో 51 సార్లు అజేయంగా తిరిగి వచ్చాడు.

6-ఆండ్రూ జోన్స్: ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన ఆండ్రూ జోన్స్ పేరు కూడా ఉంది. జోన్స్ 87 మ్యాచ్‌ల్లో 35.69 సగటుతో 2,784 పరుగులు చేశాడు. వన్డేల్లో ఈ న్యూజిలాండ్ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 93 పరుగులు.

7- గై విట్టల్: జింబాబ్వే ఆటగాడు గై విట్టల్ కూడా వన్డే క్రికెట్‌లో సెంచరీ చేయలేదు. ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గై విట్టల్ పేరు ఏడవ స్థానంలో నిలిచాడు. ఈ ఆటగాడు 147 మ్యాచ్‌ల్లో 22.54 సగటుతో 2,705 పరుగులు చేశాడు. వన్డేల్లో ఈ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 83 పరుగులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version