రైతులకు ఐదు శాతం… బడాబాబులకు 95 శాతం రుణాలు మాఫీ: చింతా మోహన్

రైతులకు ఐదు శాతం… బడాబాబులకు 95 శాతం రుణాలు మాఫీ: చింతా మోహన్

అమరావతి: ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే ఆర్టికల్ 130 కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని కాంగ్రెస్ నేత,
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ కంటే తక్కువ ధరకు రష్యా చమురు సరఫరా చేస్తోందని, తక్కువ ధరకు వస్తున్న చమురును ఎవరికి దోచిపెడుతున్నారని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు కేవలం 5 శాతం రుణాలు మాఫీ చేస్తే.. 95 శాతం బడా బాబుల రుణాలు మాఫీ చేశారని మండిపడ్డారు. ఐఎఎస్ శ్రీలక్ష్మిపై వైసిపి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేని చింతా మోహన్ స్పష్టం చేశారు.

Also Read: మెదక్ లో వరదలలో కొట్టుకపోయిన రైల్వే లైన్… తప్పిన పెను ప్రమాదం

Leave a Comment