Rajamouli Mahesh Babu Movie Updates: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి(SS Rajamouli) సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో గత కొంతకాలం నుండి ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ ఇప్పటికే మూడు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లోని దట్టమైన అడవుల్లో ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. మహేష్ బాబు,ప్రియాంక చోప్రా మరియు ఇతర ప్రధాన తారాగణం పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇప్పటి వరకు వరల్డ్ సినిమాలో ఎవ్వరూ చూడని కాన్సెప్ట్ తో తెరకెక్కుస్తున్నారట. టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ గురించి లేటెస్ట్ గా తెలిసిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే సౌత్ ఆఫ్రికా కి వెళ్లే ముందు మూవీ యూనిట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్స్ వేసారట. ఇక్కడ షూటింగ్ జరిపేందుకు ప్రయత్నం చేశారు. మహేష్ బాబు కూడా హాజరయ్యాడు. కానీ ఆయన వల్ల కాలేదు, వెంటనే షూటింగ్ నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మహేష్ బాబు చిన్నప్పటి నుండి ఎండ తాకిడి కి తట్టుకోలేకపోయేవాడు. కాసేపు ఎండలో నిలబడితే చాలు, ఆయన చర్మం మొత్తం ఎర్రగా మారిపోతుంది, కొన్ని కొన్ని సార్లు షూటింగ్స్ లో స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే సమ్మర్ లో, ఎండ తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహేష్ బాబు షూటింగ్స్ చేయడానికి అసలు అంగీకరించేవాడు కాదు. కానీ రాజమౌళి సినిమా అవ్వడం తో కాంప్రమైజ్ కాకుండా ఎండలో షూటింగ్ చేసే సాహసం చేశాడు, కానీ తట్టుకోలేకపోయాడు, దీంతో ఆయన షూటింగ్ నుండి వాకౌట్ చేయాల్సి వచ్చింది.
ఇక సౌత్ ఆఫ్రికా లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన కారణంగా, ఇప్పట్లో ఇండియా కి వచ్చే అవకాశం లేకపోవడం తో, వేసిన సెట్స్ ని తొలగించాల్సి వచ్చిందట. దాని వల్ల దాదాపుగా నిర్మాతకు రెండు కోట్ల రూపాయిల నష్టం వాటిల్లినట్టు అయ్యింది. ఈ సంఘటన చూస్తుంటే మహేష్ బాబు ఎంత సున్నితమైన మనిషో అర్థం అవుతుంది. ఇక్కడ ఎండలనే తట్టుకోలేకపోతున్న మహేష్ బాబు, ఇక సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ ఎలా తట్టుకుంటాడో, అసలు రాజమౌళి ఎలా ప్లాన్ చేసాడో అని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా విలన్ క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు జోడిగా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ మొత్తం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మీదనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు షూట్ చేసిన ప్రతీ షెడ్యూల్ లోనూ మహేష్ తో పాటు ప్రియాంక ఉంది. రాజమౌళి ఆమెకు చాలా బలమైన క్యారక్టర్ రాసినట్టు ఉన్నాడని అనుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.