మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

– Advertisement –

పాట్నా: బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో కొందరు వ్యక్తులు.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని (Modi Mother)  దూషించారని బిజెపి ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో మొహమ్మద్ రిజ్వి అలియాస్ రాజా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సింగ్వారాలోని బాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

అయితే బిజెపి చేసిన ఈ ఆరోపణలపై (Modi Mother) కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. బిహార్ సిఎం నితీశ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను తీరును తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై స్పందించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగుస్థాయికి చేరుకున్నాయని అన్నారు.

Also Read : భారత్ కు జపాన్ కీలక భాగస్వామి : మోడి

– Advertisement –

Leave a Comment