Prabhas And Megastar: ప్రతీ సంక్రాంతికి మన టాలీవుడ్ స్టార్ హీరోల క్రేజీ చిత్రాలు కనీసం రెండు మూడు అయినా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ 2020 సంక్రాంతి తర్వాత స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు సంక్రాంతికి విడుదలైన దాఖలాలు లేవు. కేవలం ఒక్క స్టార్ హీరో సినిమా మాత్రమే విడుదల అయ్యేది. మిగిలిన సినిమాల్లో సీనియర్ హీరో సినిమా ఒకటి, చిన్న హీరోల సినిమాలు ఒకటి రెండు ఉండేవి. అయితే ఇప్పుడు 2026 సంక్రాంతికి మరోసారి మనం భారీ క్లాష్ ని చూడబోతున్నాము. రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Raja Saab), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. నిన్ననే ‘రాజా సాబ్’ నిర్మాత విశ్వ ప్రసాద్ తమ సినిమాని జనవరి 9 న విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
ఇక మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 13 న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి చిరంజీవి సినిమాకే మార్కెట్ లో ఎక్కువ బజ్ ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది. ఆయన గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించింది మన కళ్లారా చూసాము. అక్షరాలా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అలాంటి హిట్ తర్వాత మెగాస్టార్ తో తీస్తున్న చిత్రమంటే ఆ మాత్రం బజ్ ఉండడం లో ఆశ్చర్యం లేదు. పైగా చిరంజీవి కామెడీ టైమింగ్ లో ఎలాంటి కింగ్ అనేది మన అందరికీ తెలిసిందే. ఆయన కామెడీ చేసాడంటే ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడతారు. అదే విధంగా అనిల్ రావిపూడి కి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.
వీళ్లిద్దరి కాంబినేషన్ నే డైనోసార్ లాగా కనిపిస్తుంటే, విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో స్పెషల్ క్యారక్టర్ చేస్తూ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలను ఇంకా పెంచేలా చేశారు. ఇక రాజా సాబ్ విషయానికి వస్తే ప్రభాస్ అనే బ్రాండ్ పేరు తప్ప, ప్రత్యేకతలు ఏమి లేవు. ఆ చిత్ర దర్శకుడు మారుతీ గత చిత్రం ‘పక్కా కమర్షియల్’ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. పైగా రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి కూడ రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే ఈ చిత్రం పై ప్రస్తుతానికి అయితే అంచనాలు భారీగా లేవు, భవిష్యత్తులో అంచనాలు పెరగొచ్చు. ఇది ఇలా ఉండగా గతం లో ప్రభాస్, చిరంజీవి 2004 సంక్రాంతికి పోటీ పడ్డారు. చిరంజీవి అంజి చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రభాస్ వర్షం చిత్రం తో వచ్చాడు. వీటిల్లో వర్షం చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. చిరంజీవి అంజి చిత్రం మాత్రం ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ ఈ సంక్రాంతికి అదే రిపీట్ అవుతుందా?, లేకపోతే రివర్స్ అవుతుందా అనేది చూడాలి.