సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు వస్తాయి. కానీ సరైన ఆహారం, జీవనశైలి లేకపోతే కొద్ది వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. దీనినే అకాల వృద్ధాప్యం (Premature Ageing) అంటారు. మీ శరీరం త్వరగా ముసలిదవుతోందని తెలిపే కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసటగా అనిపించడం
రోజుకు సరిపడా నిద్రపోయినా కూడా ఎప్పుడూ అలసిపోయినట్లు, బలహీనంగా అనిపిస్తే అది మీ శరీరం వేగంగా వృద్ధాప్యం అవుతోందని అర్థం. దీనికి హార్మోన్ల మార్పులు, విటమిన్ డి లేదా బి12 లోపం, సరిగా తినకపోవడం వంటివి కారణాలు కావచ్చు.
ఏం చేయాలి..?
- పోషకాలున్న ఆహారం తినండి.
- రోజూ తగినంత నీరు తాగండి.
- యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి.
- డాక్టర్ సలహాతో విటమిన్ పరీక్షలు చేయించుకోండి.
కడుపు చుట్టూ కొవ్వు
బరువు ఎక్కువగా లేకపోయినా కడుపు దగ్గర మాత్రమే కొవ్వు పెరగడం, కండరాల బలం తగ్గడం కూడా వృద్ధాప్య సంకేతాలే. ఇది 30 ఏళ్లు దాటిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది.
ఏం చేయాలి..?
- గుడ్లు, చికెన్, పప్పులు, పనీర్ వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- చక్కెర ఉన్న పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
కీళ్ల నొప్పులు
ఎలాంటి దెబ్బలు తగలకుండానే కీళ్లలో నొప్పి లేదా కీళ్లు గట్టిగా అనిపిస్తే.. అది కూడా వయసు త్వరగా పెరిగిపోతోందనే సంకేతం. దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి.
ఏం చేయాలి..?
- కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తినండి.
- స్విమ్మింగ్, యోగా, స్ట్రెచింగ్ వంటి సులభమైన వ్యాయామాలు చేయండి.
- మీ శరీర బరువును అదుపులో ఉంచుకోండి.
జ్ఞాపకశక్తి తగ్గడం
విషయాలు గుర్తుంచుకోలేకపోవడం, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం కూడా అకాల వృద్ధాప్యం లక్షణమే. వయసు పెరిగే కొద్దీ మెదడు కణాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది.
ఏం చేయాలి..?
- పుస్తకాలు చదవండి, పజిల్స్, మెదడుకు పని చెప్పే ఆటలు ఆడండి.
- చేపలు, వాల్‌నట్స్ వంటి ఒమేగా 3 ఉన్న ఆహారాలు తీసుకోండి.
- రోజూ 7 నుంచి 8 గంటల పాటు బాగా నిద్రపోండి.
చర్మం పొడిబారడం
చర్మం పొడిబారి, ముడతలు పడటం, వేలాడినట్లు అనిపించడం కూడా వయసు ముందుగానే పెరిగిపోతోందని తెలుపుతుంది. శరీరంలో కొల్లాజెన్ అనే పదార్థం తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.
ఏం చేయాలి..?
- రోజూ ఎక్కువ నీరు తాగండి.
- మద్యం, సిగరెట్లు మానేయండి.
- యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలు తినండి.
- మంచి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడండి.
ఈ లక్షణాలు చిన్న వయసులోనే కనిపిస్తే వాటిని అశ్రద్ధ చేయకండి. సరైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేకుండా జీవించడం, మంచి అలవాట్లతో మీరు అకాల వృద్ధాప్యాన్ని ఆపవచ్చు.
[