మహేష్ బాబు కి డూప్ దొరికేసాడు…ఇంతకి రాజమౌళి

SSMB29 Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ ని విదేశాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండగా మొన్నటిదాకా రాజమౌళి మహేష్ బాబు కు డూప్ అవసరం లేదని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబుకి డూప్ ని సెట్ చేశారట. ఆయన ఎవరూ అంటే మహేష్ బాబు లా కనిపించే డూప్ శ్రీను కావడం విశేషం… మహేష్ బాబు లాగే తను ఉంటాడు కాబట్టి తనతో కొన్ని రిస్కీ షాట్స్ చిత్రీకరించవచ్చు అనే ఉద్దేశ్యంతో చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి

మరి రిస్కీ షాట్స్ సైతం డూప్ చేయడానికి సిద్ధమయ్యారట. అందువల్లే అతని చేత చేయించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా హీరోలకు డూప్ చేయడం అంటే ఆషామాషీ కాదు. కొన్ని సందర్భాల్లో కాళ్లు చేతులు సైతం విరిగిపోతూ ఉంటాయి. హీరోలకు డూప్ అంటే అన్ని స్టంట్స్ చేయాల్సి ఉంటుంది.

ఒకానొక సందర్భంలో హీరో డూప్ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి డూప్ లు సైతం కొంతవరకు కేర్ ఫుల్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి మహేష్ బాబుకి ఒక డూపు ను సెట్ చేసి భారీ ఫైట్ చిత్రీకరించాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఈ విషయంలో రాజమౌళి చాలా వేగంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక రాజమౌళి ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…

Leave a Comment