అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో తన జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు అనేక అంశాలపై చర్చించారు. జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంలో కొత్త సువర్ణ అధ్యాయానికి బలమైన పునాది వేసామని, రాబోయే దశాబ్దానికి సహకారానికి ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసాము” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. “నేటి చర్చలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడంలో బలమైన ప్రజాస్వామ్యాలు, సహజ భాగస్వాములు. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశంలో జపాన్ నుండి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడిని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.
10 సంవత్సరాల భారతదేశం-జపాన్ రోడ్ మ్యాప్ పెట్టుబడి, ఆవిష్కరణ, ఆర్థిక భద్రత, పర్యావరణం, సాంకేతికత, ఆరోగ్యంపై దృష్టి సారిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం-జపాన్ భాగస్వామ్యం పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మన జాతీయ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. మన ఉమ్మడి విలువలు, నమ్మకాల ద్వారా రూపొందించడం జరిగింది. భారత్-జపాన్ స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, శాంతియుతమైన, సంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఉగ్రవాదం, సైబర్ భద్రత విషయంలో భారత్-జపాన్ ఒకేలాంటి ఆందోళనలను కలిగి ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. మా ఉమ్మడి ఆసక్తులు రక్షణ, సముద్ర భద్రతకు సంబంధించినవి. రక్షణ పరిశ్రమ, ఆవిష్కరణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.
Addressing the joint press meet with PM Ishiba.@shigeruishiba https://t.co/84iLYW7lkT
— Narendra Modi (@narendramodi) August 29, 2025
ప్రధానమంత్రి మోదీతో చర్చల తర్వాత, ప్రధాని ఇషిబా మాట్లాడుతూ, రాబోయే తరం సవాళ్లను ఎదుర్కోవడానికి మనం ఒకరి బలాలను ఒకరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో పాటు, ప్రపంచ శాంతి మరియు స్థిరత్వానికి భారతదేశం-జపాన్ మధ్య సహకారం ముఖ్యమని కూడా ఆయన అన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశంలో జపాన్ నుండి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తదుపరి తరం సవాళ్లను ఎదుర్కోవడానికి రెండు వైపులా ఒకరి బలాలను మరొకరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..