కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం మీద ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ముసాయిదా జాబితా గయా జిల్లాలోని ఓ గ్రామ ప్రజలంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొందన్నారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా బీహార్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఈ ఆరోపణ చేశారు. ఈసి మ్యాజిక్ కాకుంటే ఏమిటిది… పల్లె జనం అంతా ఒకే ఇంట్లో ఉండడం ఏమిటి? అని ఆయన నిలదీశారు. బారాచట్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గయాలోని నిదానీ గ్రామానికి చెందిన మొత్తం 947 ఓటర్లు ఇంటి నంబర్ ఆరులోనే ఉండడం ఏమిటని ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నించారు.
